Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జనసేనను పవన్ బీజేపీలో విలీనం చేస్తారా?

Written By సెల్వి
Updated: గురువారం, 5 డిశెంబరు 2019 (12:51 IST)
జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశమైనాయి. గతంలో బీజేపీని, అమిత్ షాని తిట్టిపోసిన పవన్.. ప్రస్తుతం రూటు మార్చి ఏపీ సీఎం జగన్‌పై ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తావన తీసుకురావడం సంచలనంగా మారింది.
 
ప్రస్తుతం దేశ రాజకీయాలకు మోదీ, అమిత్ షా వంటి వ్యక్తులే కరెక్ట్ అని, అలాంటి వారే అన్యాయాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తారంటూ పవన్ కామెంట్ చేశారు. ఆ భయం వీళ్లకు ఉందని, అందుకే వాళ్ళను చూసి భయపడుతున్నారంటూ వైసీపీని టార్గెట్ చేశారు.
 
అంతేగాకుండా తానెప్పుడూ బీజేపీకి దూరంగా లేనని.. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో విభేదించి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశానని కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 
 
అలాగే తెలుగుదేశం, బీజేపీ క‌లిపి ప‌నిచేస్తే అధికారంలోకి వ‌స్తుంద‌న‌డం కొస మెరుపు. ఏదేమైన‌ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ అమిత్ షా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనే దానిపై రాజకీయవర్గాల్లో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. 
 
ఏపీలో అధికార వైసీపీని కనుమరుగు చేయాలంటే..  బీజేపీలో జనసేనను విలీనం చేయడం ఒక్కటే మార్గమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని టాక్ వస్తోంది. అందుకే జనసేనాని నోట బీజేపీపై మాటలొచ్చాయని రాజకీయ వర్గాల సమాచారం. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments