గురువారం, 13 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (21:55 IST)

టీడీపీ నుంచి వైసీపీకి వంగవీటి రాధా జంప్.. నిజమేంటంటే?

vangaveeti radha
వంగవీటి రాధా 2019 ఎన్నికలకు ముందు జగన్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరారు. అయితే 2024 ఎన్నికల కోసం రాధా టీడీపీని వీడి మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల సమాచారం. వైసీపీ నుంచి ఆయనకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే రాధా ఈ పుకార్లపై స్పందించి, తాను తెలుగుదేశంలోనే కొనసాగుతానని ధృవీకరించారు. 
 
తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్ వెంట ఉండబోనని రాధా తేల్చి చెప్పారు. తన పార్టీ మార్పుపై వస్తున్న పుకార్లు నిరాధారమైన చర్చ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో 2024 ఎన్నికలకు తెలుగుదేశంతో కలిసి పనిచేస్తున్నట్లు ఖరారు చేయడంతో తాను టీడీపీలో చేరుతానన్న టాక్‌లో నిజం లేదని తీసుకోవచ్చు.
 
2019లో జగన్‌పై నిప్పులు చెరిగిన రాధా వైసీపీని వీడిన తీరును పరిశీలిస్తే.. ఆయన వైసీపీలోకి తిరిగి రావడం చాలా అసంభవమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.