Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

రైలు బోగీలపై పసుపు - తెలుగు రంగుల్లో గీతలు ఎందుకు ఉంటాయి?

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 15 డిశెంబరు 2020 (10:25 IST)
భారతీయ రైల్వే.. ఆసియాలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రపంచంలో రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌గా గుర్తింపును సొంతం చేసుకుంది. మన దేశంలో 1853, ఏప్రిల్ 16వ తేదీన తొలిసారి రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలి రైలు ముంబై నుంచి థానేల మధ్య 33 కిలోమీటర్ల దూరం నడిపారు. ఆ తర్వాత అంచలంచెలుగా అభివృద్ధి చెందిన భారతీయ రైల్వే 1951లో జాతీయకరణ జరిగింది. ఇలా అనేక ప్రత్యేకతలు కలిగిన ఇండియన్ రైల్వే... రైలు బోగీలపై మూడు రంగుల్లో గీతలు ఉంటాయి. ఇవి ఎందుకు ఉంటాయో చాలా మందికి తెలియదు. వాటి గురించి ఓ సారి తెలుసుకుందాం. 
 
కొన్ని రైలు బోగీ చివరన టాయిలెట్ ఉంటుంది. దీని కిటికీ పైభాగంలో పసుపు, తెలుపు, ఆకుపచ్చ (గ్రే) రంగుల్లో గీతలో ఉంటాయి. ఒక్కో బోగీపై ఒక్కో రకమైన రంగుతో ఈ గీతలు ఉంటాయి. వీటి వెనుక ఉండే రహస్యం అనేక మందికి తెలియదు.
 
నిజానికి మన దేశంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు, సూపర్ ఫాస్ట్ రైళ్ల బోగీలు నీలం రంగులో ఉంటాయి. ఈ నీలం రంగులో ఉండే రైలు బోగీలపై తెలుపు రంగులో గీతలు ఉంటాయి. అంటే, తెలుపు రంగులో గీతలు ఉండే రైలు బోగీలు అన్‌రిజర్వుడ్ బోగీలని అర్థం. 
 
అలాగే, పసుపు రంగులో గీతలు ఉన్న బోగీలు వికలాంగుల బోగీ, పసుపు లేదా గ్రే రంగులో గీతలు ఉండే బోగీలు.. కేవలం మహిళలకు కేటాయించిన ప్రత్యేక రైలు బోగీ అని అర్థం. రైలులో ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ ఈ తరహా గుర్తులను రైలు బోగీలపై వేసింది. 

అన్నీ చూడండి

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా హీరో కుమార్తె

నేను చేసిన 6 నిమిషాల నవరసాల సీన్ హైలైట్ గా నిలుస్తుంది - నరేష్ విజయ కృష్ణ

Kajal Chowdary: గోల్డ్ స్పాట్ మూవీ ఫస్ట్ సింగిల్ పరిచయమే. రిలీజ్

జై జాస్తి, మేధ మేక హీరో హీరోయిన్‌లుగా మైత్రీ ఇన్ లవ్ ప్రారంభం

Deva Katta: వ‌ర్షాలు ప‌డితే వ‌జ్రాలు దొరుకుతాయనే కథ తో జో జో’ కాష‌న్ 1 చిత్రం

తర్వాతి కథనం
Show comments