శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 నవంబరు 2020 (09:52 IST)

ట్రంప్ ఫ్యామిలీని వదలని కరోనా.. డొనాల్డ్ జూనియర్‌కి కోవిడ్

Donald Trump_son
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబాన్ని కరోనా వైరస్‌ వెంటాడుతోంది. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌ దంపతులు కోవిడ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్‌ పెద్ద కుమారుడు జూనియర్‌ ట్రంప్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన తన క్యాబిన్‌లోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఎలాంటి లక్షణాలు ఆయనలో కనిపించలేదని.. కానీ టెస్టులో పాజిటివ్ అని తేలినట్లు అధికారులు తెలిపారు.
 
ప్రస్తుతం ఆయన కోవిడ్‌-19 మెడికల్‌ గైడ్‌లైన్స్‌ని పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. జూనియర్‌ ట్రంప్‌ కరోనా బారిన పడటంతో ట్రంప్‌ దంపతులతో పాటు వారి చిన్న కుమారుడు బారన్‌, ఇతర సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు. అంతకుముందు శుక్రవారం, వైట్ హౌస్ సహాయకుడు, ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియాని కుమారుడు ఆండ్రూ గియులియాని తాను కరోనా బారిన పడినట్లు ప్రకటించాడు.