శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (17:16 IST)

ఢిల్లీని వీడిన సోనియా గాంధీ .. పనాజీలో మకాం!

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలు దేశ రాజధాని ఢిల్లీని వీడారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే ఛాతి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియా.. వైద్యుల సలహా మేరకు ఢిల్లీని వదిలారు. ప్రస్తుతం గోవా రాష్ట్ర రాజధాని పనాజీకి చేరుకున్నారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీకూడా ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పనాజీకి వచ్చారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా ఇటీవల వైద్యులను సంప్రదించగా కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతంలో గడపాలని సూచించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దేశ రాజధాని ఢిల్లీని వీడుతున్నట్లు శుక్రవారం ఉదయం ప్రకటించారు. 
 
కొంతకాలంగా సోనియా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తుండటంతో పలువురు శ్వాసకోశ, గొంతు సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోనియా కొద్ది రోజులపాటు పనాజీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.