సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 నవంబరు 2020 (10:52 IST)

రాహుల్‌‌లో ఏదో తెలియని భయం .. టీచర్‌ను ఆకట్టుకునే విద్యార్థి : బరాక్ ఒబామా

కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ అనుభవాలతో పాటు.. జీవితకాల జ్ఞాపకాలతో ఆయన "ఏ ప్రామిస్డ్ ల్యాండ్" అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో రాహుల్ గురించి బరాక్ ఒబామా రాసిన విషయాలను న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది.
 
ఇందులో రాహుల్ గాంధీ గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాహుల్‌లో ఏదో తెలియని భయం నెలకొనివుందన్నారు. ముఖ్యంగా, పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఆకట్టుకునే విద్యార్థిలా ఉంటారని రాసుకొచ్చారు. 
 
అంతేకాకుండా, ఆయనలో ఏదేని ఒక అంశాన్ని లోతుగా నేర్చుకోవాలనే అభిరుచి లేదని పేర్కొనడం గమనార్హం. రాహుల్ గురించి మాత్రమే కాకుండా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
రాహుల్‌ గాంధీ 2017లో ఒబామాను కలిశారు. ఆ సమయంలో ఇందుకు సంబంధించిన ఫొటోను రాహుల్ పోస్ట్ చేశారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడి హోదాలో ఈ నల్లసూరీడు భారత్‌లో రెండు పర్యాయాలు అధికారికంగా పర్యటించారు.