మన్మోహన్‌ను ప్రధాని చేయడం వెనుక చాలా మతలబు : బరాక్ ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన ఆత్మకథను "ఏ ప్రామీస్డ్ ల్యాండ్" అనే పుస్తక రూపంలో ఆవిష్కరించారు. ముఖ్యంగా, తాను అమెరికా అధినేతగా ఉన్న సమయంలో వివిధ దేశాధినేతలతో ఉన్న పరిచయాలు, ఇతరాత్రా చర్చలు, వ్యూహాలను కూడా ఆయన ఈ పుస్తకంలో ఏకరవు పెట్టారు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఎంపిక చేయడానికి గల కారణాలను ఒబామా తన పుస్తకంలో వెల్లడించారు. అదేసమయంలో ఆయన సోనియా గాంధీ మనస్తత్వాన్ని కూడా ఎండగట్టారు.
తన పుత్రుడు, యువ నేత రాహుల్ గాంధీకి భవిష్యత్తులో ఎలాంటి ఉండరాదనే సోనియా గాంధీ అప్పట్లో మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా ఎంపిక చేశారన్నారు. గాంధీ కుటుంబానికి రాహుల్‌ని వారసుడిగా చూపించడానికి సోనియా చాలా ప్రయత్నించారని తెలిపారు.
అందులోభాగంగానే పెద్దగా ప్రచారం లేని మన్మోహన్‌ను ప్రధాని చేశారని అభిప్రాయపడ్డారు. మన్మోహన్‌కు పదవులపై పెద్దగా ఆసక్తి లేదు. జాతీయ స్థాయిలో ఆయనకంటూ ఓ వర్గం లేదు. మన్మోహన్‌తో ఎలాంటి ముప్పు లేదని భావించిన సోనియా ఆయనను ప్రధానిని చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గొప్ప ఆర్థికవేత్తగా, ముందు చూపున్న నేతగా భావించి సోనియా మన్మోహన్‌ను ప్రధానిని చేయలేదన్నారు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిన సోనియాగాంధి ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. అంతేకాకుండా, రాహుల్ గాంధీని దిశలేని నాయకుడిగా బరాక్ ఒబామా పేర్కొన్న విషయం తెల్సిందే.