శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (10:15 IST)

#HappyInternationalMensDay2020: నవంబరు 19వ తేదీనే ఎందుకు?

Happy International Men's Day 2020
అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి తెలిసేవుంటుంది. కానీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే ప్రతీ ఏడాది నవంబరు 19వ తేదీన అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చే ప్రాముఖ్యత పురుషుల దినోత్సవానికి కనిపించట్లేదు. అసలు పురుషుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు. నవంబరు 19వ తేదీనే ఎందుకు? ఈ రోజున పురుషులు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. 
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 1909వ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు. 1969నుండి పురుషుల దినోత్సవం గురించి డిమాండ్ చేస్తున్నారు. చివరికి డాక్టర్ జీరోమ్ టీలక్సింగ్ చేత 1999నుండి పురుషుల దినోత్సవం మొదలైంది. జీరోమ్ టీలక్సింగ్ తన తండ్రి పుట్టినరోజైన నవంబరు 19వ తేదీని పురుషుల దినోత్సవంగా మొదలెట్టాడు.
 
ప్రపంచ పురుషుల సమస్యలను పరిష్కరించడానికి, మానసిక, శారీరక ఒత్తిడి వంటి వాటిపై చర్చించి, ఆత్మహత్యలు చేసుకోనివ్వకుండా వారిలో ధైర్యాన్ని నింపే ఉద్దేశ్యంతో ప్రపంచ పురుషుల దినోత్సవం ప్రారంభమైంది. మానసిక ఒత్తిడి తట్టుకోలేక 45సంవత్సరాల లోపు గల వయస్సులో చాలామంది పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికై పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు.
 
ఈ సంవత్సరం పురుషుల దినోత్సవం థీమ్ ఏంటంటే, సానుకూల పురుష మార్గదర్శులు.. దీని ప్రకారం పురుషుల ఆరోగ్యం, శ్రేయస్సు గురించి అవగాహన. దీని ప్రకారం వారు అనుభవిస్తున్న ఒత్తిడిని అర్థం చేసుకోవాలి. పురుషులు ఏడవకూడదు అనే భావనని విడిచిపెట్టి, వారు అనుభవిస్తున్న మానసిక వేదనని ప్రశాంతంగా వెలిబుచ్చాలి. వారి మనుసులోని భావాలని పురుషులు అన్న కారణంగా వారిలోనే అణచివేసుకోకుండా చెప్పుకునేందుకు కావాల్సిన సాయం అందించాలి. అందుకే ఈ రోజును జరుపుకుంటారు. పురుషులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. 
 
పురుషుల దినోత్సవ కొటేట్స్... 
పురుషులు దేవుని అందమైన సృష్టి, కానీ వారు పరిపూర్ణంగా లేరు, కాబట్టి వారికి చాలా లోపాలు ఉండటం సాధారణం. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు!
 
ఇతర వ్యక్తుల జీవితాలను విడిచిపెట్టడానికి మనిషి తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఇది ఒక ధైర్యమైన చర్య. హృదయపూర్వక పురుషుల దినోత్సవం.
 
దేవుని సృష్టిలో మనిషి చాలా అందమైన భాగం, అతను చాలా సున్నితమైన వయస్సులో రాజీపడతాడు. పురుషులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు.
 
ఒక తండ్రి తన కొడుకును తన జీవితాన్ని ప్రారంభించటానికి సహాయం చేస్తాడు, మరీ ముఖ్యంగా, అతను మనిషిగా మారడానికి సహాయం చేస్తాడు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు! "
 
"మీరు మీ కుటుంబం మరియు ప్రియమైనవారి సంక్షేమం కోసం మీ ఆనందాన్ని మరియు జీవితాన్ని త్యాగం చేస్తారు. మీకు అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు."
 
"మనిషి జీవితం నుండి నేర్చుకోగల అతి ముఖ్యమైన పాఠం ఏమిటంటే, ఈ ప్రపంచంలో బాధ ఉందని కాదు, కానీ దానిని ఆనందంగా మార్చడం అతనికి సాధ్యమే."-రవీంద్రనాథ్ ఠాగూర్.