ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 22 జనవరి 2024 (20:24 IST)

దక్షిణాదిలో ఫ్యాషన్ ప్రమాణాలను పెంచే లక్ష్యంతో డ్రాగన్ హిల్ విస్తరణ ప్రణాళిక

Dragon Hill store
సంప్రదాయం, ఫ్యాషన్‌లో ఆవిష్కరణల పరంగా అత్యున్నతమైన బ్రాండ్ డ్రాగన్ హిల్, తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది.  కల్వకుర్తి, సంగారెడ్డి, ఖమ్మం, ఆర్మూర్, నిర్మల్, అనకాపల్లిలో వ్యూహాత్మకంగా తమ స్టోర్‌లను ప్రారంభించింది. 400 నుండి 850 చదరపు అడుగుల విస్తీర్ణంలో వున్న ప్రతి దుకాణం ఈ ప్రాంతంలోని ప్రజల హృదయాలకు అత్యుత్తమమైన ఫ్యాషన్‌ను చేరువ చేయడంలో డ్రాగన్ హిల్ యొక్క తిరుగులేని నిబద్ధతను సూచిస్తుంది. 
 
ప్రత్యేకంగా రూపొందించిన స్టోర్లలో, ఫ్యాషన్ ఔత్సాహికులు డ్రాగన్ హిల్ యొక్క విభిన్న కలెక్షన్లను అన్వేషించవచ్చు, ఇక్కడ దుస్తులు   కాలానుగుణమైన సొగసుకు ఉదాహరణగా నిలుస్తాయి. సాంప్రదాయం, ఆధునికత, ప్రామాణికమైన ఫ్యాషన్ యొక్క పరివర్తన శక్తిని ఆస్వాదించటానికి ఫ్యాషన్ ప్రియులను ఆహ్వానిస్తూ, దక్షిణాదిలో తమ వైభవోపేతమైన ప్రవేశాన్ని వేడుక చేసుకోవడానికి డ్రాగన్ హిల్ 50% వరకు తగ్గింపుతో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తుంది.
 
దక్షిణాది స్టోర్ విస్తరణ ప్రణాళికల గురించి, డ్రాగన్ హిల్ వ్యవస్థాపకుడు & సీఈఓ మయూర్ సోలంకి మాట్లాడుతూ, "డ్రాగన్ హిల్ ప్రయాణంలో చెప్పుకోదగ్గ మైలురాయిని సూచిస్తూ, తెలంగాణలో ఐదు స్టోర్‌లు, ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్టోర్‌‌ను ప్రారంభించినందుకు సంతోషిస్తున్నాము. ముంబైలో మా కార్యకలాపాలను అనుసరించి, కల్వకుర్తి, సంగారెడ్డి, ఖమ్మం, ఆర్మూర్, నిర్మల్, అనకాపల్లిలో మా స్టోర్స్ ద్వారా దక్షిణాదికి అత్యుత్తమ ఫ్యాషన్‌ని తీసుకురావాలనే మా అంకితభావాన్ని నొక్కిచెబుతున్నాము.." అని అన్నారు 
 
డ్రాగన్ హిల్ యొక్క కలెక్షన్లు సాంస్కృతిక వారసత్వం యొక్క సంక్లిష్టత నుండి సమకాలీన శైలుల ఆకర్షణ, ఆయా శైలుల యొక్క శాశ్వతమైన వేడుకను సూచిస్తాయి. నూలు, దుస్తుల నుండి బటన్లు మరియు ట్యాగ్‌ల వరకు, డ్రాగన్ హిల్ ద్వారా 100% భారతదేశంలో రూపొందించి తయారు చేయబడింది.