బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 మే 2023 (22:34 IST)

దక్షిణాదిలో 'గ్రేట్ 4X4 X-పెడిషన్' మొదటి జోనల్ డ్రైవ్‌ను ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్ మోటార్

image
టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) దేశవ్యాప్తంగా మోటారు ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, అసాధారణమైన మూడు రోజుల సాహసయాత్రకు నాంది పలుకుతూ ఈరోజు 'గ్రేట్ 4x4 ఎక్స్-పెడిషన్' ను ప్రారంభించింది. ఈ థ్రిల్లింగ్ డ్రైవ్ ప్రధాన లక్ష్యం అసమానమైన ఆఫ్-రోడింగ్ అనుభవం ద్వారా అభిమానులను ఆకర్షించడం, వారితో మమేకం కావడం, వారిని సాధారణతకు మించి వెళ్లేలా ప్రోత్సహించడం, వారిలో సాహస స్ఫూర్తిని రగిలించడం, టయోటాతో ఈ ఉత్తేజకరమైన ప్రయాణం ద్వారా శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడం. ఈ కార్యక్రమం లో పాల్గొనే 4x4 కమ్యూనిటీకి "మాస్ హ్యాపీనెస్" అందించడానికి సిద్ధంగా ఉంది.
 
టయోటా ఈ గ్రేట్ 4x4 X-పెడిషన్‌ను బెంగళూరు నుండి ప్రారంభించింది. దక్షిణ భారతదేశం నుండి 4x4 ఔత్సాహికుల దీనిలో పాల్గొన్నారు. లెజెండరీ Hilux, Fortuner 4x4, LC 300, Hyryder AWD సహా ఇతర SUV బ్రాండ్‌ల వాహనాలను సగర్వంగా సొంతం చేసుకున్న యజమానులు తమ వాహనాల యొక్క నిజమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఆఫ్-రోడింగ్‌కి సిద్ధమయ్యారు. ఆఫ్ రోడింగ్‌లో ఔత్సాహికులచే నడపబడే 4x4 SUVల యొక్క ఆకట్టుకునే కాన్వాయ్‌,  రాబోయే రెండు రోజులలో హసన్ మరియు సకలేష్‌పూర్‌లోని విభిన్న మార్గాల్లో ప్రయాణిస్తుంది.
 
ఈ X-పెడిషన్‌లో అంతర్భాగంగా, TKM ఒక అదనపు 4WD ట్రాక్‌ని సృష్టించింది. దీనిలో సహజసిద్ధమైన ఆర్టిక్యులేషన్, సైడ్ ఇంక్లైన్‌లు, రాంబ్లర్, డీప్ డిచ్‌లు, స్లష్, రాకీ బెడ్‌లు మరియు మరెన్నో సహజమైన అడ్డంకులను సైతం సృష్టించింది. గతంలో మరెవ్వరూ అందించని విధంగా అత్యున్నత ఆఫ్-రోడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. రాబోయే కొద్ది రోజులలో, ఈ సవారీ లో పాల్గొనేవారు థ్రిల్లింగ్ ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్‌లలో మునిగిపోవడమే కాకుండా, ఈ ప్రాంతం యొక్క సుందరమైన అందాలలో లీనమవుతారు మరియు దారిలో ఉన్న చారిత్రక ప్రదేశాలనూ అన్వేషిస్తారు. ఈ కార్యక్రమం స్థిరత్వం దిశగా కంపెనీ లక్ష్యం వెల్లడించటంతో పాటుగా ప్రకృతి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి దోహదం పడేలా సామాజిక జోక్యాల ఆవశ్యకతనూ తెలుపుతుంది.  అంతేకాకుండా, ఈ రైడ్ లో  హాజరైనవారు స్పూర్తిదాయకమైన 4x4 అవుట్‌డోర్ లైఫ్‌స్టైల్ అనుభవం యొక్క ఉత్సాహాన్ని పెంపొందించగల వివిధ వినోద కార్యక్రమాలలో సైతం  పాల్గొనవచ్చు.
 
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి 'గ్రేట్ 4x4 X-పెడిషన్' ప్రారంభాన్ని గురించి, టయోటా కిర్లోస్కర్ మోటార్ యొక్క సేల్స్ మరియు స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ మాట్లాడుతూ, "టయోటా యొక్క గ్రేట్ 4x4 X-పెడిషన్ 4x4 అభిమానులతో కనెక్ట్ అయ్యేలా రూపొందించబడింది,  మరపురాని ఈ ప్రయాణంలో భాగమయ్యే అవకాశాన్ని వారికి అందించడం ద్వారా వారి అనుభవాలను సుసంపన్నం చేస్తుంది. ఉత్సాహంగా ఈ రైడ్ లో పాల్గొన్న వారందరికీ మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు వారికి సురక్షితమైన, చిరస్మరణీయమైన మరియు ఉత్తేజకరమైన డ్రైవ్‌ అనుభవాలు లభించాలని కోరుకుంటున్నాము” అని అన్నారు.