సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 31 జనవరి 2023 (16:47 IST)

నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌

crysta
టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌(టీకెఎం) నేడు తమ నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. 2005లో ఇన్నోవాను పరిచయం చేసిన నాటి నుంచి ఈ వాహనం భారతీయ మార్కెట్‌లో ఇంటి పేరుగా మారిపోయింది. దీనియొక్క సౌకర్యం, భద్రత, విశ్వసనీయత, విలాసం మరియు శక్తిపరంగా ఇది ప్రశంసనలను పొందింది. ఈ నూతన ఇన్నోవా క్రిస్టా ఇప్పుడు వృద్ధి చేయబడిన ఫ్రంట్‌ ఫాసియాతో వస్తుంది. దీనిని రగ్డ్‌, దృఢమైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని తీర్చిదిద్దారు.  తద్వారా భారతీయ కుటుంబాలు, వ్యాపారవేత్తలు, కార్పోరేట్స్‌ మరియు ఫ్లీట్‌ యజమానుల అవసరాలను తీర్చనుంది.
 
నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఇటీవల విడుదల చేయగా, అసాధారణ స్పందన అందుకున్న ఇన్నోవా హై క్రాస్‌ (గ్యాసోలిన్‌ మరియు స్ట్రాంగ్‌ హై బ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ట్రైన్స్‌లో లభ్యం)ను ఇది అనుసరిస్తుంది. దీనియొక్క గ్లామర్‌ కోషెంట్‌, అత్యాధునిక సాంకేతికత, సౌకర్యంతో పాటుగా భద్రత, డ్రైవ్‌ చేయడానికి ఉద్విగ్నపూరిత అనుభవాలను అందించడం వల్ల ప్రతి సందర్భానికీ తగిన వాహనంగా నిలిచింది. ఒంటరిగా లేదంటే కటుంబంతో కలిసి ప్రయాణించేందుకు అనువైన వాహనంగా నిలిచింది.
 
నూతన ఇన్నోవా క్రిస్టా బుకింగ్స్‌, సరికొత్త ఇన్నోవా హై క్రాస్‌ను ఆవిష్కరణను అనుసరించడమన్నది వినియోగదారుల పట్ల టయోటా యొక్క మల్టీ టెక్నాలజీ విధానానికి నిదర్శనంగా నిలుస్తూనే డీజిల్‌ పవర్‌ట్రైన్‌ కోరుకునే వారి అవసరాలను తీర్చగలదు. ఈ ప్రకటన గురించి టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ సేల్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అతుల్‌ సూద్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో ప్రతిష్టాత్మక ఇన్నోవా ప్రయాణం 2005లో ఆవిష్కరించిన నాటి నుంచి ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ సాగింది.

ఎదురులేనట్టి రీతిలో ఈ విభాగంలో నాయకునిగా కొనసాగడంతో పాటుగా, ఈ వాహనం, తన పూర్తి సరికొత్త అవతారంలో దేశవ్యాప్తంగా ప్రశంసలను పొందుతుంది. నాణ్యత, మన్నిక మరియు విశ్వసనీయత వంటి లక్షణాలకు ప్రతి రూపంగా భారతీయ మార్కెట్‌లో వెలుగొందుతుంది.  నేడు నూతన ఇన్నోవా క్రిస్టాకు బుకింగ్స్‌ను తెరువడంతో  మేము మా వినియోగదారులకు వారు అభిమానించే ఎంపీవీని నాలుగు గ్రేడ్‌లలో అందిస్తున్నాము. రగ్డ్‌ మరియు ప్రాక్టికల్‌ వాహనం కోరుకునే వినియోగదారులకు ప్రాధాన్యతా వాహనంగా సాటిలేని సౌకర్యం మరియు భద్రతతో నిలుస్తుంది.
 
నూతన ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్‌లు ఇప్పుడు బుకింగ్స్‌ కోసం డీలర్లు, ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. తమ అభిమాన ఇన్నోవాను కోరుకునే మా వినియోగదారుల కోసం ఇప్పుడు బహుళ పవర్‌ట్రైన్స్‌ ఆస్వాదించేందుకు అందుబాటులో ఉన్నాయని వెల్లడించేందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. నేటితో ప్రారంభించి నూతన ఇన్నోవా క్రిస్టాను 50 వేల రూపాయలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. వినియోగదారులు డీలర్‌ ఔట్‌లెట్లు లేదా ఆన్‌లైన్‌లో టయోటాభారత్‌ డాట్‌ కామ్‌ వద్ద బుక్‌ చేసుకోవచ్చు. ఈ నూతన ఇన్నోవా క్రిస్టా నాలుగు గ్రేడ్లు జీ, జీఎక్స్‌, వీఎక్స్‌, జెడ్‌ఎక్స్‌లో ఐదు రంగులు- వైట్‌ పెరల్‌ క్రిస్టల్‌ షైన్‌, సూపర్‌ వైట్‌, సిల్వర్‌, అటిట్యూడ్‌ బ్లాక్‌ మరియు అవాంత్‌ గ్రేడ్‌ బ్రాంజ్‌లో లభ్యమవుతాయి.