శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By సిహెచ్
Last Modified: గురువారం, 17 జనవరి 2019 (17:21 IST)

సగ్గుబియ్యం వడలు.. పిల్లలు లొట్టలేస్తూ తింటారు...

పండుగ వచ్చిందంటే ఇంట్లోనే రకరకాల పిండి వంటలు, తినుబండారాలు తయారుచేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడూ చేసే వంటలే కాకుండా అప్పుడప్పుడు మార్చి మార్చి కొత్త వంటలు చేయడం వలన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సగ్గుబియ్యంతో చేసిన వెరైటీస్ ఎంతో రుచిని కలిగి ఉండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో తోడ్పడతాయి. కనుక ఇప్పుడు మనం సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...
 
కావలసిన పదార్ధాలు..
సగ్గుబియ్యం-పావుకిలో
బంగాళదుంపలు- 3
పచ్చిమిర్చి-6
ఉప్పు- తగినంత
జీలకర్ర- టీ స్పూన్
కొత్తిమీర తురుము- కొద్దిగా
నూనె- వేయించడానికి సరిపడా
బియ్యంపిండి-2 టీ స్పూన్లు
వంటసోడా- చిటికెడు
 
తయారుచేసే విధానం...
సగ్గుబియ్యం ఓ గంట ముందే నానబెట్టాలి. తరువాత బంగాళదుంపలు ఉడికించి పొట్టుతీసి మెత్తగా మెదపాలి. ఒక గిన్నెలో సగ్గుబియ్యం, చిదిమిన ఆలూ, జీలకర్ర, పచ్చిమిర్చితురుము,ఉప్పు, బియ్యంపిండి, వంటసోడా, కొత్తిమీర తురుము అన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ప్లాస్టిక్ కాగితం మీద నూనె రాసుకుంటూ వడల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం వడలు రెడీ.