శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 7 జనవరి 2019 (20:36 IST)

పిల్లలు స్నాక్స్ అని గోల చేస్తున్నారా? బాదం పూరీలు పెట్టి చూడండి...

సాధారణంగా చిన్న పిల్లలు స్నాక్స్ అంటే చాలా ఇష్టపడతారు. బజారులో దొరికే స్నాక్స్ వలన పిల్లలకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక మనం ఇంటిలోనే రకరకలైన వంటకాలను తయారుచేసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం సులువుగా ఇంట్లోనే తయారుచేసుకోగలిగే వంటకాలలో బాదం పూరీ ఒకటి. ఇప్పుడు అది ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం... ఈ బాదం పూరీ తయారుచేయటానికి కావలసిన పదార్ధాలు...
 
1. గోధుమపిండి, మైదాపిండి(చెరిసగం చొప్పున)-పావు కిలో 
2. నెయ్యి-2 టేబుల్ స్పూన్లు,
3. కుంకుమపూవు- కొద్దిగ
4. బేకింగ్ పౌడర్- టీ స్పూన్,
5. యాలకులపొడి- టీ స్పూన్,
6. పంచదార-పావుకిలో
7. నూనె- వేయించడానికి సరిపడా,
8. బాదం పప్పు-20,
9. బాదం, పిస్తా పలుకులు-కొద్దిగ.
 
తయారుచేసే విధానం...
వేడి నీళ్లలో బాదం పప్పును 20 నిమిషాలు నానబెట్టి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, కాసిని నీళ్లు పోసి చిక్కని పాలలా చేయాలి. గోధుమపిండి మిశ్రమంలో నెయ్యి వేసి కలపాలి. తరువాత బాదంపాలు పోసి చపాతీ పిండిలా కలపాలి. పిండిముద్ద మీద తడిబట్ట కప్పి పదిహేను నిమిషాలు నాననివ్వాలి. వీటిని ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండని పూరీలా చేసి దాని మీద నెయ్యి పూసి త్రికోణాకారం వచ్చేలా మడత పెట్టాలి. 
 
ఒక గిన్నెలో పంచదార వేసి అది మునిగేవరకు నీళ్లు పోసి మరిగించాలి. తీగపాకం వచ్చాక కుంకుమపూవు, యాలుకలపొడి వేసి కలపాలి. బాణలిలో నీరుపోసి కాగాక బాదం పూరీలను వేయించి పాకంలో వేసి కొంత సమయం ఉంచి తీయాలి. వీటిని ప్లేటులో పెట్టి బాదం, పిస్తా పలుకులు చల్లితే చూడటానికి ఇంపుగాను, తినటానికి రుచిగాను ఉంటాయి.