Daily Horoscope
✕

గోధుమ పిండి పరోటాలు ఎలా చేయాలో తెలుసా?

Written By సిహెచ్
Updated: శనివారం, 2 ఫిబ్రవరి 2019 (19:50 IST)
మనం ప్రతిరోజు రకరకాల అల్పాహారాలను చేసుకొని తింటూ ఉంటాం. కానీ పరోటాలు చాలా అరుదుగా మాత్రమే చేస్తూ ఉంటాం. కానీ పిల్లలు కొత్త ఐటమ్స్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పరోటాలను పిల్లలకు ఇష్టం అయ్యేలా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు:
క్యాబేజీ తురుము- రెండు కప్పులు,
గోధుమపిండి- రెండు కప్పులు,
గరం మసాలా- అర టీ స్పూన్,
తరిగిన కొత్తిమీర- ఒక కట్ట,
పసుపు- చిటికెడు,
కారం- ఒక టీ స్పూన్,
నూనె- రెండు టీ స్పూన్లు,
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు,
ఉప్పు- తగినంత,
నీళ్లు-తగినన్ని.
 
తయారీ విధానం...
క్యాబేజీ తురుములో కొద్దిగా ఉప్పువేసి ఉడకబెట్టి, ఉడికాక నీరు మెుత్తం పిండేయాలి. తర్వాత నూనె, నెయ్యి మినహా మిగిలిన పదార్ధాలన్నింటిని ఒక గిన్నెలో వేసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. చివర్లో నూనె కూడా వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పరోటాలు చేసుకొని పెనం మీద నెయ్యితో  కాల్చుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉంచే పరోటాలు రెడీ.

అన్నీ చూడండి

శనివారం, అక్టోబర్ 17, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే..?

తెలంగాణలో నీటి సంరక్షణకు ఆనందన- కోకా-కోలా ఇండియా ఫౌండేషన్, ఎస్ఎమ్ సెహగల్ ఫౌండేషన్‌లకు జాతీయ అవార్డు

లాటరీ కంపెనీ నుంచి డీఎంకే - అన్నాడీఎంకేలకు రూ.260 కోట్ల విరాళం

పుంగనూరు ఘటన వెనుక పెద్దిరెడ్డి కుటుంబం : ప్రత్యక్ష సాక్షిని నేనే : రామచంద్ర యాదవ్

మీరట్ కేసు : భర్తను చంపి దుప్పట్లో పామును వదిలిన భార్యకు ఉరిశిక్ష

అన్నీ చూడండి

కచా బాదం పాటను డిస్ప్లే చేసారని కాన్పూర్ దాండియా ఈవెంట్ నుండి అంజలి అరోరా నిష్క్రమణ

Nag: ఇట్లు అర్జున సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది : నాగార్జున

Devika Bhat: రియాలిటీ ప్రేమలో మునిగిపోయిన కిరణ్ అబ్బవరం, దేవికా భట్

Jabardasth Emmanuel: నందినీ రెడ్డి ఆవిష్కరించిన డెస్టినీ ఫస్ట్ లుక్

Dulquer Salmaan: ఆకాశంలో ఓ తార చిత్రం టీజర్ సిద్ధమవుతోంది

తర్వాతి కథనం
Show comments