శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (12:36 IST)

కార్న్ చిప్స్ ఎలా తయారు చేయాలి..?

కావలసిన పదార్థాలు:
మొక్కజొన్నపిండి - 1 కప్పు
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - పావుస్పూన్
బేకింక్ పౌడర్ - పావుచెంచా
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా ఓ చిన్న బౌల్ తీసుకుని అందులో మొక్కజొన్నపిండి, ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత పిండిని చిన్న చిన్న చపాతీల్లా వత్తుకుని త్రికోణాకారంలో కోసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి వేడయ్యాక.. వాటిని వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే... కార్న్ చిప్స్ రెడీ..