శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (14:43 IST)

ఉసిరి మురబ్బా తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
ఉసిరికాయల తురుము - 1 కప్పు
నీరు - పావుకప్పు
చక్కెర - పావుకప్పు
యాలకుల పొడి - అరస్పూన్
దాల్చిన చెక్క - చిన్నముక్క.
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో ఉసిరి తురుము, నీరు, చక్కెర వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత యాలకుల పొడి, దాల్చినచెక్క పొడి వేసి మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం చిక్కబడడానికి 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు దాల్చినచెక్క తీసేయాలి. అంతే ఉసిరి ముబ్బా రెడీ. ఈ మిశ్రమం నెలరోజుల పాటు వాడుకోవచ్చు.