సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (14:02 IST)

ఆపిల్ కోకోనట్ హల్వా తయారీ విధానం..?

కావలసిన పదార్థాలు:
ఆపిల్ - 1
పచ్చి కొబ్బరి - 1 కప్పు
నెయ్యి - తగినంత
చక్కెర - 1 కప్పు
పాలు - 1 కప్పు
యాలకులు పొడి - కొద్దిగా
డ్రైఫ్రూట్స్ - 20 గ్రా
 
తయారీ విధానం:
ముందుగా ఆపిల్‌ను తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రైఫ్రూట్స్‌ను నెయ్యితో వేయించుకోవాలి. ఆ తరువాత ఓ గిన్నె తీసుకుని అందులో పాలు, కొద్దిగా నీరు, ఆపిల్ తురుము, పంచదార వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం గట్టిపడేముందు కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి 2 నిమిషాలు ఉడికించి పైన డ్రైఫ్రూట్స్ వేసి దించేయాలి. ఆపై కాసేపు ఫ్రిజ్‌లో కాసేపు ఉంచి తీసుకుంటే.. ఆపిల్ కోకోనట్ హల్వా రెడీ.