శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 17 జనవరి 2019 (22:16 IST)

రాత్రి భోజనం అనంతరం ఉసిరి పొడిలో తేనెను కలిపి తీసుకుంటే?

ఇటీవల కాలంలోమనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్ల లోపం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తి మనం అనేక మందులను వాడవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇలా మందులను వాడేకంటే మన పెరటిలో ఉండే ఉసిరికాయను తీసుకుంటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఉసిరికాయలో ఎన్నో ఆరోగ్య విలువలు, ఔషధ లక్షణాలు ఉన్నాయన్న విషయం మన అందరికి తెలిసిందే. ముఖ్యంగా శృంగార సమస్యలతో బాధపడేవారు ఉసిరికాయను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉసిరికాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. పుల్లపుల్లగా వగరుగా ఉండే ఈ ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉన్నాయి. యాపిల్‌తో పోలిస్తే ఇందులో మూడు రెట్లు ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
 
2. దానిమ్మ పండుతో పోలిస్తే దాదాపు 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
 
3. ఉసిరిలో యాంటీవైరల్, యాంటీమాక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరికాయ రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
 
4. శృంగార సామర్ధ్యం పెంపొందించడంలో ఉసిరి కీలక పాత్రను పోషిస్తుంది. ఆ సమయంలో వచ్చే అలసటను దూరం చేస్తుంది.
 
5. ఉసిరికాయ హృద్రోగం, మధుమేహం రాకుండా కాపాడుతుంది. మెదడు పనితీరు మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఉసిరిలో ఉన్న విటమిన్ సి శరీరాన్ని ఎండ వేడి నుంచి కాపాడుతుంది.
 
6. జుట్టుకు సరైన పోషణను అందిస్తుంది. చుండ్రు కేశ సంబంధిత అనేక సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
7. ఉసిరిని తీసుకోవడం వల్ల చర్మంపై మచ్చలను, వయసు మీద పడటం వల్ల వచ్చే ముడతలను నివారించుకోవచ్చు.
 
8. ఉసిరిని ముద్దగా నూరి అందులో కొద్దిగా పసుపు, నువ్వుల నూనె కలిపి శరీరానికి పట్టించి స్నానం చేయడం వల్ల చర్మం సహజ సౌందర్యంతో మిలమిల మెరుస్తూ ఉంటుంది. ఇది శరీరంలోని ప్రీ రాడికల్స్‌ను శరీరం నుండి బయటకు పంపి వృద్దాప్య చాయలను అరికడుతుంది.
 
9. రాత్రి భోజనం అనంతరం ఒక స్పూన్ ఉసిరి పొడిలో తేనెను కలిపి తీసుకుంటే ఎసిడిటీ లేదా కడుపుమంట నుండి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు. ప్రతిరోజు ఉసిరికాయ రసం లేదా ఉసిరి పొడిని తీసుకోవడం ద్వారా రక్తశుద్ది జరుగుతుంది.