శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : శనివారం, 12 జనవరి 2019 (16:23 IST)

ఉసిరితో లడ్డూలా.. ఎలా చేయాలి..?

కావలసిన పదార్థాలు:
ఉసిరికాయలు - 1 కిలో
చక్కెర - 1 కిలో
 
తయారీ విధానం:
ముందుగా ఉసిరికాయలను నీళ్ళల్లో బాగా కడిగి ప్రెషెర్ కుక్కర్లో వేసి ఉడికించాలి. ఈ ఉడికించిన ఉసిరికాయలు పూర్తిగా చల్లారిన తరువాత సన్నని ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేయాలి. ఇప్పుడు పాన్ తీసుకుని అందులో ఉసిరికాయ తరుగు, చక్కెర వేసి ఆ మిశ్రమం చిక్కబడే వరకు గరిటెతో ఆపకుండా కలుపుతుండాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తరువాత దించి చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒకే పరిమాణంలో గుండ్రంగా ఒత్తితుంటే ఉసిరి లడ్డూ రెడీ.