జొన్నపిండితో వడియాలు.. ఎలా..?  
                                       
                  
                  				  కావలసిన పదార్థాలు:
	జొన్నపిండి - 1 కప్పు
	మంచినీరు - 5 కప్పులు
	కారం - అరస్పూన్
	ఉప్పు - సరిపడా
				  											
																													
									  
	ఇంగువ - చిటికెడు.
	 
	తయారీ విధానం:
	ముందుగా జొన్నపిండిలో రెండు కప్పుల నీరు కలిపి పలచగా చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన నీటిని మరిగించుకోవాలి. అందులో ఉప్పు, కారం వేసి మరిగిన నీళ్ళల్లో జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇవి బాగా ఉడికిన తరువాత ఇంగువ కలపాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తరువాత ఒక ప్లాస్టిక్ షీటుపై స్పూన్‌తో పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని గుండ్రంగా వడియాలు పెట్టాలి. వీటిని బాగా ఎండబెట్టుకోవాలి. వడియాలు బాగా ఎండిన తరువాత గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరచాలి. నూనెలో దోరగా వేయించి తీసుకుంటే.. జొన్నపిండి వడియాలు రెడీ.