Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్దీ స్నాక్ రాజ్మా కట్ లెట్ ఎలా చేయాలి?

Written By సెల్వి
Updated: మంగళవారం, 19 నవంబరు 2019 (13:40 IST)
రాజ్మా మాంసాహారం కన్నా ఎక్కువ శక్తిని శరీరానికి అందిస్తుంది. అందువల్ల శాకాహారులకు ఇది మంచి ఎనర్జిటిక్‌ ఫుడ్‌‌గా చెప్పవచ్చు. ఇందులో ఫైబర్‌ అధిక మోతాదులో ఉండడం వలన కొలెస్ట్రాల్‌‌ని తగ్గిస్తుంది. మైగ్రేన్‌, కీళ్ల నొప్పులనుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మతి మరుపు ని తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ఇందులో క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్‌ వంటి ఖనిజ లవణాలతో పాటు కాపర్‌, ఒమేగా ఫ్యాటి ఆసిడ్స్‌ లభిస్తాయి. అలాంటి రాజ్మాతో పిల్లలకు నచ్చేలా కట్‌లెట్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావల్సిన పదార్థాలు : 
ఉడికించిన రాజ్మా - కప్పు 
ఉడికించి బంగాళదుంపలు - ఒక కప్పు 
పచ్చిమిర్చి తరుగు - పావు స్పూన్,
కొత్తిమీర తురుము - పావు కప్పు, 
కారం - అర టేబుల్‌ స్పూను, 
ఉప్పు, నూనె - తగినంత ధనియాలపొడి - అర టేబుల్‌ స్పూను,
జీలకర్ర పొడి - పావు టేబుల్‌ స్పూను, 
గరంమసాలా పొడి - అర టేబుల్‌ స్పూను, 
శనగపిండి - టేబుల్‌ స్పూను
 
తయారీ విధానం: ఒక వెడల్పాటి పాన్ తీసుకుని అందులో ఉడికించిన రాజ్మా, బంగాళాదుంపల్ని స్మాష్ చేసుకోవాలి. ఇందులో కారం, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, ఆమ్‌చూర్‌ పొడి, కొత్తిమీర తురుము, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. 
 
ఈ మిశ్రమాన్ని ఐదునిమిషాల పాటు పక్కనబెట్టేయాలి. ఆపై స్టౌవ్ మీద పాన్ పెట్టుకుని నూనె వేసి బంగాళదుంప, రాజ్మా మిశ్రమాన్ని కట్‌లెట్‌లా చేసుకొని రెండు వైపులా దోరగా వేయించుకుని సర్వింగ్ ప్లేటులోకి తీసుకోవాలి. ఈ కట్‌లెట్లను టమోటా కెచప్‌‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. స్కూల్ నుంచి ఇంటికొచ్చే పిల్లలకు ఈ స్నాక్స్ బాగా నచ్చుతుంది. ఇంకా ఆరోగ్యకరం కూడా.

అన్నీ చూడండి

జగన్ కళ్లలో ఆనందం కోసమే వైకాపా నేతల అకృత్యాలు : మంత్రి పార్థసారథి

పిల్లలు పుట్టరు.. ఆడ శిశువును కొనుగోలు చేసి ఢిల్లీకి వెళ్తుండగా...?

అస్సాంలో అమానవీయ ఘటన - బాలిక మర్మాంగంలోకి ఇనుప రాడ్డును చొప్పించి...

గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం: బరిలోకి అంబటి రాంబాబు?

కేరళ ప్రభుత్వాసుపత్రి టాయిలెట్‌లో నవజాత శిశువ... 20 ఏళ్ల అవివాహిత?

అన్నీ చూడండి

MS Raju: ఒక్కడు కి మహేష్ బాబు, వర్షం కి ప్రభాస్, అగధ కి నటించిన వారంతా కరెక్ట్ : ఎం.ఎస్. రాజు

Mayaledi : మాయలేడి ప్రేమలో పడిన రాకేష్ వర్రే ఏమి తెలుసుకున్నాడు?

దొరసాయి తేజ క్రైమ్ థ్రిల్లర్ దందా ఎలా ఉందంటే... దందా రివ్యూ:

డాడీ సీఎం కావడం ఓ చారిత్రాత్మకం : జాసన్ సంజయ్

Nani and Nithin: : నాని క్లాప్ తో నితిన్ హీరోగా అలియాస్ రుక్మిణి ప్రారంభం

తర్వాతి కథనం
Show comments