శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By మనీల
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (16:10 IST)

మిరపకాయలు తింటే ఆయుష్షు పెరుగుతుందట.. (వీడియో)

మిరపకాయలు తింటే ఆయుష్షును పెంచుకోవచ్చునని తాజా అధ్యయనాలు తేల్చాయి. కారం ఎక్కువగా తీసుకోవడం ద్వారా అధికబరువు సమస్య నుంచి కొంతవరూ తప్పించుకోవచ్చునని పరిశోధనలు తేల్చాయి. తాజాగా అమెరికాలో నిర్వహించిన పరిశోధనల్లో పండు మిరపకాయలు ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వలన పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు తెలిపారు. 
 
అమెరికాలో 16వేల మంది మీద సుమారు 23 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. ఈ కాలంలో వారి ఆహార అలవాట్లు, వారి ఆరోగ్య స్థితిని గమనించారు. పండుమిరపకాయలు ఎక్కువగా తినే వారిలో తక్కువ ఆరోగ్య సమస్యలు కనిపించగా, తక్కువ తీసుకునే వారిలో గుండెపోటు వంటి సమస్యలను గుర్తించారు. కారం ఎక్కువ తినడం వలనే దీర్ఘాయుష్షు సాధ్యమన్న విషయాన్ని వీరు స్పష్టం చేయకపోయినా, కొన్నిరకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని పరిశోధకులు తెలిపారు. 
 
మిరపకాయలోని క్యాప్సైసిన్, డీహైడ్రోక్యాప్సైసిన్‌లుండటం వలన బ్లడ్ షుగర్ లేదా గ్లూకోజ్ శాతాన్ని నియంత్రిస్తుంది. శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచి ధమనుల గోడలలో పేరుకుపోయి ఉన్న కొవ్వును ఇది తొలగిస్తుంది. అలాగే రక్తం గడ్డకట్టి ఉంటే కూడా దానిని నివారించేందుకు మిరపకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు.