ఈశాన్య దిక్కులో వృక్షాలుంటే పురుషులకు హానికరమా?

సోమవారం, 10 నవంబరు 2014 (15:35 IST)
సాధారణంగా ఇంటికి ఈశాన్య దిక్కులో చాలామంది చిన్నపాటి చెట్లను, పూలకుండీలను పెంచుతుంటారు. అయితే భారీ వృక్షాలు ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. ముఖ్యంగా ఈ దిశలో వృక్షాలు ఉంటే ఇంటిలోని పురుషుల ఆరోగ్యానికి హానికరమని ఈ శాస్త్రం చెపుతోంది. కానీ నైరుతిలో, ఆగ్నేయంలో పెద్ద చెట్లు ఉండటం మంచిది. 
 
కాబట్టి పై రెండు దిశల్లో వృక్షాలు మీ ఇంటి బయటి స్థలానికి దగ్గరగా ఉన్నా ఫలితాలు పైవిధంగానే ఉన్నాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు చెబుతున్నారు. దుష్ఫలితాలు కలిగించగల ఏ దిశలో చెట్టున్నా దాని వైపుగా మీ ఇంటిలో ఉన్న కిటికీలో ఓ చిన్న మామూలు అద్దం పెట్టడం శ్రేయస్కరం.
 
కానీ మొక్కలు ఫలానా దిశలో పెట్టరాదు అన్న అనుమానం వద్దు. ఇంట్లో మొక్కలు పెంచడం ఇంట్లో దోషమున్న చోట ఆక్సిజన్ నింపడమే. దోషంలోని విషవాయువును లేదా కార్బన్-డై-ఆక్సైడ్‌ అవి పీల్చుకుంటాయి. అలాగే ఒక దిశలో మొక్కలు పెంచితే ఆ దిశకు సంబంధించిన రంగు బల్బు పెట్టడం మరిచిపోకూడదు. 
 
ఇలా చేయడం ద్వారా కిరణ జన్య సంయోగ క్రియకు కావాల్సిన వెలుతురును బల్బు ద్వారా మనం ఇస్తున్నామన్న విషయాన్ని మరిచిపోకూడదు. అందుకే కనీసం 21 రోజులయినా 24 గంటలూ బల్బులు వెలిగించి ఉంచాలన్న నియమం పెట్టారని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

ఐఐటి గోల్డ్ మెడలిస్ట్, రూ. 2.9 కోట్ల ప్యాకేజీ వదిలేసి గ్రోసరి షాపు నడుపుతున్నాడు, ఎందుకు?

వైజాగ్ బీచ్ షాక్స్ వల్ల నేరాలే కాదు వారికి అసౌకర్యం.. రోడ్డెక్కిన విద్యార్థులు

Revanth Reddy 20 Years: మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క.. మహా వృక్షమైంది.. రేవంతన్న (video)

Anakapalli, ప్రియుడి మోజులో భర్తను మంచంలోనే మట్టుబెట్టిన భార్య

హైదరాబాద్ దేశంలో మూడవ అత్యంత ఖరీదైన నివాస మార్కెట్‌గా నిలిచింది: నైట్ ఫ్రాంక్ అఫోర్డబిలిటీ ఇండెక్స్

అన్నీ చూడండి

04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

Sankatahara Chaturthi 2026: జూలై 3న కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి.. 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా..

02-07-2026 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి

Show comments