1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 జులై 2025 (20:34 IST)

Guru Purnima 2025: జూలై 10న గురు పూర్ణిమ.. వేద వ్యాసుడిని పూజిస్తే ఏంటి ఫలితం?

Veda Vyas
Veda Vyas
గురు పూర్ణిమ జూలై 10న వస్తోంది. ఈ రోజున గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. గురువును భగవంతునికి, భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తారు. అలాంటి ఈ పవిత్రమైన రోజున వ్యాస మహర్షితో పాటు విష్ణుమూర్తిని, పరమేశ్వరుడిని పూజించాలి. 
 
గురు పౌర్ణమి రోజున గీతాపారాయణం చేయడం, గోమాతకు పూజలు, సేవలు చేయాలి. విష్ణువు, లక్ష్మీదేవీలను పూజించేటప్పుడు తులసి ఆకులను సమర్పించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. 
 
గురు పౌర్ణమి రోజున పసుపు ధాన్యాలు, పసుపు వస్త్రాలు, పసుపు రంగు స్వీట్లు దానం చేయడం ద్వారా జాతకంలో గురు దోషాలను తొలగించుకోవచ్చు. 
 
గురు పౌర్ణమి రోజున వేద వ్యాసులు జన్మించారు. ఆయన వేదాలను నాలుగు భాగాలుగా విభజించి రచించారు. ఈ రోజున వ్యాసమహర్షిని పూజించడం ద్వారా అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. ఇంకా జ్ఞానం వస్తుందని విశ్వాసం.