శ్రావణ శుక్రవారం పూట పూజ చేస్తే?

బుధవారం, 6 ఆగస్టు 2014 (19:23 IST)
శ్రావణ శుక్రవారం పూట మహిళలు అమ్మవారిని నిష్ఠతో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఆ రోజున దుర్గాదేవిని ఆలయాల్లో సందర్శించుకునే వారికి పుణ్య ఫలితాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. 
 
శ్రావణ శుక్రవారం ఉదయమే ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని, పసుపు, కుంకుమలు, పుష్పాలతో దివ్యసుందరంగా అలంకరించుకోవాలి. మహిళలు అమ్మవారి ఫోటోకు గానీ, ప్రతిమకు గానీ మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను సమర్పించాలి. అనంతరం చక్కెర పొంగలి, అటుకుల పాయసంను అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కర్పూర హారతులు సమర్పించుకోవాలి. 
 
పూజకు పిమ్మట మాంగల్యసూత్రములోని పసుపు తాడును మార్చుకోవడం చేస్తే ఐదోతనం ప్రాప్తించి సుఖసంతోషాలతో జీవిస్తారని పండితులు అంటున్నారు. అంతేగాకుండా శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో నేతితో దీపమెలిగించే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయని వారు చెబుతున్నారు. 
 
అందుచేత శ్రావణ శుక్రవారమైన నేడు అమ్మవారి దేవాలయాలను సందర్శించడం శ్రేయస్కరం. ఇంకా మహిళలు పసుపు, కుంకుమలను ముత్తైదువులకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

అన్నీ చూడండి

అతడు ఓ అనుమానపు పురుగు, పక్కా ప్రణాళికతోనే నా కుమార్తెను హత్య చేసాడు: రాధాగాయత్రి తండ్రి

కేతన్ హత్యకు కారణం అతడి బట్టతల? అది నచ్చక సియా అగర్వాల్ చంపేసిందట...

వైజాగ్ కలెక్టర్‌గా చిన్నారి ఆర్ణ, సీఎం చంద్రబాబుతో మీటింగ్.. సీఎం ఫిదా.. రీ ట్వీట్... వీడియో వైరల్

ప్రైవేట్ సంస్థల అధిక ఫీజుల భారాన్ని పరిష్కరించాల్సిందే- నారా లోకేష్

నిన్న ఆర్టీసీ బస్సులో జర్నీ... నేడు మారథాన్ రన్.. సీఎం విజయ్ అదుర్స్ (video)

అన్నీ చూడండి

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

Show comments