Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 96 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసులు!

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 8 డిశెంబరు 2020 (15:15 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య 96 లక్షలు దాటిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఆరోగ్య బులిటెన్‌లో ఈ విషయం వెల్లడైంది. పైగా, గడచిన 24 గంటల్లో 36,652 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,08,211కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,533 మంది కోలుకున్నారు.
 
ముఖ్యంగా, గత 24 గంట‌ల్లో 12 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,39,700కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 90,58,822 మంది కోలుకున్నారు. 4,09,689 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
అలాగే, తెలంగాణలో గత 24 గంటల్లో 596 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 802 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,72,719కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,62,751 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,470కి చేరింది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 8,498 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,465 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102, రంగారెడ్డి జిల్లాలో 46 కరోనా కేసులు నమోదయ్యాయి.  

అన్నీ చూడండి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

Balakrishna: కుర్చీలోనే బాలక్రిష్ణకు రక్షాబంధన్ కట్టిన తోబుట్టువులు

Kittu Pavan: తెలంగాణా ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా చిత్రం ప్రారంభమైంది

తర్వాతి కథనం
Show comments