నెక్ ఫ్యాట్ తగ్గించుకోవాలా.. సోడా.. సాఫ్ట్ డ్రింక్స్ వద్దే వద్దు!
నెక్ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే.. సోడా, సాఫ్ట్ డ్రింక్స్‌ను దూరంగా ఉంచాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే హెల్తీ కార్బోహైడ్రేట్స్ మాత్రం తీసుకోవాలి. అనారోగ్యకరమైన వివిధ రకాల ప్రొసెస్డ్ ఫుడ్స్‌ను తీసుకోకూడదు. తృణధాన్యాలను తీసుకోవాలి. డైట్‌లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చిరుధాన్యాలు, డైరీప్రొడక్ట్స్,లీన్ మీట్ తీసుకోవాలి.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా అందుతుంది . ఇలాంటి పైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల నెక్ ఫ్యాట్ ను సులభంగా తగ్గించుకోవచ్చు. కూర్చొనే భంగిమ కరెక్ట్‌గా ఉండాలి. మీతలను ఎప్పుడూ నిటారుగా ఉంచుకోవాలి. ఉప్పును తగ్గించాలి.
పౌష్టికాహారం తీసుకోవాలి. మధ్య మధ్యలో ఏవి పడితే అవి తినకూడదు. ముఖ్యంగా ఫ్యాట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. శరీరానికి అవసరం అయ్యేంత నీరు తీసుకోవాలి. పండ్లరసాలకు బదులుగా తాజాగా ఉండే పండ్ల రసాలను తీసుకోవాలి.. ఇలా చేస్తే నెక్ ఫ్యాట్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.