మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలి...
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మనిషికి ఎన్ని ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యంగా ఉంటే అడివిలోనైనా జీవితాన్ని గడిపేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రం జీవన మను
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మనిషికి ఎన్ని ఉన్నా ఆరోగ్యంగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యంగా ఉంటే అడివిలోనైనా జీవితాన్ని గడిపేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రం జీవన మనుగడలో ముఖ్యమైనది.
అయితే, మనిషికి వచ్చే జబ్బుల్లో మూర్ఛరోగం ఒకటి. ఈ వ్యాధి బారిన పడినపుడు ఏం చేయాలో చాలామందికి తెలియదు. మూర్ఛవచ్చినప్పుడు.. ఆపే ప్రయత్నం చేయకూడదు. మూర్ఛ వచ్చిన సమయంలో బలవంతంగా నోట్లోకి ఏమీ కుక్కకూడదు. తగినంత గాలి ఆడేవిధంగా చూడాలి. వాంతిని మింగకుండా ఉండేందుకు పక్కకు తిరగాలి. వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ వ్యాధి ఉన్న వారు వైద్యుని సలహా మేరకు అన్నీ పాటించవలసిన అవసరం ఉంటుంది.
కొంతమంది పిల్లల్లో జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఫిట్స్ వస్తుంటాయి. వీరిలో కొంతమందిలో జీవితాంతం కూడా మందులు వాడవలసిన అవసరం ఉంటుంది. మరికొంత మందిలో మందులు వాడినా కూడా ఫిట్స్ వస్తూనే ఉంటాయి. వీరికి ఆపరేషన్ వలవ కూడా ఫిట్స్ తగ్గే అవకాశం ఉండదు.