సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 31 జులై 2023 (20:30 IST)

స్ట్రాబెర్రీలు తినేవారు తెలుసుకోవాల్సినవి

Strawberry
స్ట్రాబెర్రీలు. ఎరుపుగా వుండే ఈ పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, ఫైబర్‌తో పాటు పాలీఫెనాల్స్ అని పిలువబడే అధిక స్థాయి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. స్ట్రాబెర్రీలను తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. స్ట్రాబెర్రీలు గ్లూకోజ్ స్థాయిపై మంచి ప్రభావాన్ని చూపడంతో టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. స్ట్రాబెర్రీలో ఫైబర్ పుష్కలంగా వుండటం వల్ల వీటిని తింటే ఆకలి ఎక్కువ కాదు.
 
స్ట్రాబెర్రీలో ఉండే ఫైబర్ కూడా ఉదర సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీలలో విటమిన్-బి, సి వున్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. స్ట్రాబెర్రీలోని పొటాషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, అయోడిన్ ఎముకలు, కీళ్ల నొప్పిని దూరం చేస్తుంది.
 
స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్-సి కళ్లకు మేలు చేస్తుంది. స్ట్రాబెర్రీ తినడం వల్ల చర్మం కాంతివంతమై ముడుతలను నివారిస్తుంది.