1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2023 (15:50 IST)

కిడ్నీలను క్లీన్ చేసే పండ్లు.. ఇతర పదార్థాలేంటి?

Kidney
శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను కిడ్నీలు బయటికి పంపుతాయి. అందువ‌ల్ల కిడ్నీల‌ను సంర‌క్షించుకోవాలి. వాటిని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకోసం ఈ పండ్లను, అలాగే కొన్ని పదార్థాలను తీసుకోవాలి. 
 
అవేంటంటే.. కొబ్బరినీళ్లు అప్పుడప్పుడు తాగుతూ వుండాలి. కొబ్బ‌రినీళ్లలో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి కిడ్నీల‌ను సుర‌క్షితంగా ఉంచుతాయి. అయితే కొబ్బరినీళ్ల‌ను మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. లేదంటే ఆ నీళ్ల‌లో ఉండే సోడియం కిడ్నీల‌కు హాని చేస్తుంది. అలాగే నీటిని కూడా తీసుకుంటూ వుండాలి. 
 
అలాగే అల్లం ర‌సంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల‌ను మెరుగ్గా ప‌నిచేసేలా చేస్తాయి. కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. రోజుకు రెండు స్పూన్లు అల్లం రసం తీసుకోవాలి. బీట్‌రూట్‌ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల‌ను శుభ్రం చేస్తాయి. 
 
ఇంకా ఆపిల్ పండ్లను తినడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా స్ట్రాబెర్రీల్లో వుండే ఉండే మాంగనీస్, పొటాషియం కిడ్నీలు మెరుగ్గా పని చేసేలా తోడ్పడతాయి.