శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 ఆగస్టు 2022 (21:41 IST)

అభిమాని ఆఖరి కోర్కె తీర్చిన మెగాస్టార్ చిరంజీవి

Chiru with his fan
మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ వున్నారు. ఆయనకోసం ఏమయినా చేసేందుకు రెడీ. అలాంటి ఫ్యాన్సులో మెగాస్టార్ చిరంజీవి సొంత ఊరు మొగల్తూరుకి చెందిన నాగరాజు అనే వీరాభిమాని వున్నారు. ఐతే ఆయన రెండు కిడ్నీలు పాడై ప్రాణాల కోసం పోరాడుతున్నారు.

 
తన జీవితంలో ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవి గారిని నేరుగా కలవాలని నాగరాజు తన కోర్కెను చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి... తన అభిమానిని తన నివాసానికి రప్పించి ఆప్యాయంగా పలుకరించారు. సుమారు గంటసేపు వారితో ముచ్చటించారు. మీకు వెన్నుదన్నుగా తానున్నానంటూ వారికి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం చేసారు.

 
తను ఎంతగానో అభిమానించే స్టార్ హీరోను కలసుకోవడంపై నాగరాజు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసారు.