ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By ఠాగూర్

రోజూ ఓ కప్పు ఆకుకూర.. ఆహారంలో భాగమైతే ఆరోగ్యమే

Gongura Leaves
రోజూ ఓ కప్పు ఆకుకూర ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా వున్నాయని వారు చెప్తున్నారు. ఒకే కూరలా కాకుండా రోజుకో ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. 
 
అందులో బచ్చలికూర లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తాయి. పుదీనా, కొత్తిమీరలో పోషకాలు పుష్కలం. పుదీనాలో 114 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్, 200 మి.గ్రా కాల్షియం, 15.6 మి.గ్రా ఐరన్, కొద్దిపాటి విటమిన్ ఎ, బి, సి ఉన్నాయి. ఇది రక్తహీనతను నయం చేయగలదు. 
 
కొత్తిమీరలో 184 ఎంజీ కాల్షియం, 1042 ఎంజీ ఇనుము 8,918 మైక్రోగ్రాముల విటమిన్ ఎ ఉన్నాయి. ఫాస్పరస్, విటమిన్ బి, సి కలిగి ఉంటుంది. 
 
ఇది దృష్టి లోపం, రక్తహీనతను నయం చేస్తుంది. మెంతికూరలో 395 గ్రాముల కాల్షియం, 2,340 మైక్రోగ్రాముల విటమిన్ ఎ, 1.93 మి.గ్రా ఐరన్ ఉన్నాయి. ఇక ఆంధ్రా స్పెషల్ గోంగూరలో 2.28 మి.గ్రా ఐరన్, 2,898 మైక్రోగ్రాముల విటమిన్ ఎ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి ఉన్నాయి. కాబట్టి ఆకుకూరలను తేలికగా తీసిపారేయకుండా.. రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.