బరువును తగ్గించే పాలకూర ఆమ్లెట్
బరువు తగ్గాలంటే నోరు కట్టేసుకోవడం ఒకటే మార్గమని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ పదార్థాలు తీసుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు అంటున్నారు.. పోషకాహార నిపుణులు.
బ్లాక్ బీన్స్: వీటిలో బోలెడు పీచు వుంటుంది. వీటిని తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. చాలా సేపటికి ఆకలి వేయదు. ఈ బీన్స్ హానికారక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
మిరియాలు : వీటిలోని పెపరైన్ అనే పదార్థం కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్, పొట్టా రెండింటీనీ తగ్గిస్తుంది.
బెల్ పెప్పర్: బెల్ పెప్పర్‌లో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. ఇది కొవ్వును కరిగిస్తుంది. పిండి పదార్థాలను శక్తిగా మారుస్తుంది. బరువును అదుపులో వుంచుతుంది.
పాలకూర.. పాలకూరలో ఐరన్ పుష్కలంగా వుంటుంది. ఈ ఆకుకూరను గుడ్డుతో కలిపి ఆమ్లెట్‌లా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.
కొబ్బరినూనె.. ఇందులోని కొవ్వు బరువును నియంత్రిస్తాయి. ఈ నూనె వాడకంతో కొలెస్ట్రాల్ పెరగదు. ఇంకా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.