శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 7 జూన్ 2024 (22:26 IST)

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

నేరేడు పండ్లు. వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఇవి తినేవారు దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇవి దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేస్తుంది. నోటి సమస్యలను తగ్గిస్తుంది. నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. ఇంకా నేరేడు పండ్లతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
విటమిన్ సి మరియు ఐరన్ యొక్క అద్భుతమైన మూలం, ఈ పండు హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది.
ఈ నేరేడు పండు పురుషులు తింటుంటే అవసరమైన శక్తిని పెంచుతుంది. 
నేరేడు పండు జీర్ణ శక్తిని మెరుగుపరిచి కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలను అడ్డుకుంటుంది.
నేరేడు పండ్లు తింటుంటే మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను దూరం చేసుకోవచ్చు.
ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో నేరేడు పండ్లు ఉపయోగపడతాయి.
చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు నేరేడు ఆకులు ఔషధంలా పనిచేస్తాయి.
కీళ్లనొప్పులను, లివర్ సమస్యలను తగ్గించేందుకు నేరేడు ఎంతగానో దోహదపడుతాయి.
వీటిలో పొటాషియం పుష్కలంగా ఉన్నందున అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
సున్నా కొలెస్ట్రాల్‌, అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ క్యాలరీల కారణంగా వీటిని తినేయవచ్చు.