సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 నవంబరు 2024 (16:29 IST)

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

శీతాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచగల శక్తి ఉసిరికి వుంది. ఉసిరి పొడిని పెద్దలు ఒక స్పూన్‌, పిల్లలు అరస్పూన్‌ తీసుకోవాలి. అన్నంలో తొలిముద్ద ఉసిరి కాయ పచ్చడితో తినండి. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే సి విటమిన్‌ను బాగా అందిస్తుంది. ఉసిరి పొడితే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
ఉసిరి పొడి సాధారణ జలుబుకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది.
ఉసిరి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారు ఉసిరి తీసుకోవడం ద్వారా లబ్ది పొందవచ్చు.
జీర్ణ ప్రక్రియలను ఇది మెరుగుపరుస్తుంది.
గోరువెచ్చని నీటిలో ఉసిరి పొడిని వేసి సేవిస్తే షుగర్ స్థాయిలు క్రమబద్ధంలో వుంటాయి.
కేశాలకు ఉసిరి పొడి మేలు చేస్తుంది.
ప్రాణాంతక వ్యాధి కేన్సర్ వ్యాధిని ఉసిరి నిరోధిస్తుందని తేలింది.