బేబీ కార్న్‌‌తో గర్భిణీ మహిళలకు మేలే.. నేత్ర సమస్యలు మాయం..

బేబీ కార్న్‌లో లో-కేలోరీలుంటాయి. తద్వారా తేలికగా జీర్ణమవుతాయి. బ్రోకోలీ, క్యాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్ కంటే బేబీ కార్న్‌లో లో క్యాలరీలుంటాయి. బేబీ కార్న్ తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. బేబీ క

సోమవారం, 25 జూన్ 2018 (09:45 IST)
బేబీ కార్న్‌లో లో-కేలోరీలుంటాయి. తద్వారా తేలికగా జీర్ణమవుతాయి. బ్రోకోలీ, క్యాలీఫ్లవర్, గ్రీన్ బీన్స్ కంటే బేబీ కార్న్‌లో లో క్యాలరీలుంటాయి. బేబీ కార్న్ తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. బేబీ కార్న్ మంచి రుచిని ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంద గ్రాముల బేబీ కార్న్ తింటే కేవలం 26 క్యాలరీలు మాత్రమే వస్తాయి. అందువల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి మేలైన ఆహారంగా పనిచేస్తుంది. 
 
ఇంకా బేబీ కార్న్‌లో ఫైబర్ పుష్కలంగా వుంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. అందువల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. బేబీ కార్న్‌లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. 
 
అలాగే బేబీ కార్న్‌లో కెరోటినాయిడ్స్ అనబడే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి దృష్టి సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. నేత్ర సమస్యలు ఉన్నవారు బేబీ కార్న్‌ను తరచూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు కంటి శుక్లాలు రాకుండా ఉంటాయి. ఫోలేట్ అనే పోషక పదార్థం బేబీ కార్న్‌లో పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు మేలు చేస్తుంది. శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది. అందుకే గర్భిణీ మహిళలు బేబీకార్న్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

పట్టపగలే యువతిని కొడవలితో నరికి చంపేసిన యువకుడు

బీహార్‌లో ఓ మహిళ సాహసం.. కింగ్ కోబ్రాను మెడలో వేసుకుని... (వీడియో)

భర్తను కత్తితో పొడిచి చంపేసింది... కొడుకును కత్తితో పొడించింది... తాపీగా ఫోన్ చూస్తూ....

కేసు నుంచి కొడుకును తప్పించబోయి తాను ఇరుకున్న వైకాపా మాజీ మంత్రి

ఆంధ్రాలో మళ్లీ వెలుగు చూసిన కరోనా... ఇప్పటికే నలుగురు మృతి

అన్నీ చూడండి

Aishwarya Rajesh: హీరోయిన్ కి మూడేళ్ళ స్పాన్ అనే వారు. అదే నిజం అనుకున్నా : ఐశ్వర్య రాజేష్

జీ5 కిడ్స్ లో యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ శివలోక్ కె కుండక్క మండక్క

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్. హైవాన్ లుక్

ప్రేమ, జ్ఞాపకాలతో తెరకెక్కిన సహ సినిమా చాలా నచ్చింది : కిరణ్ అబ్బవరం

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఫీల్ మై లవ్ ఫస్ట్ లుక్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments