బాదం పాలు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో...
బాదం పప్పు శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మంచిది. పోషకాహారంగానే కాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం పనికొస్తుంది. బాదంను అలాగే వాడే కంటే ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి పైన ఉన్న పొరల
బాదం పప్పు శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మంచిది. పోషకాహారంగానే కాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం పనికొస్తుంది. బాదంను అలాగే వాడే కంటే ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసివేసి వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది. అప్పుడే శరీరానికి ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చుతుంది.
బాదం పాలు ఎలా తయారు చేసుకోలంటే, బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలుపుకోవాలి. అంతే బాదం పాలు రెడీ. బాదంలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇందులో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం లేదు. అందుకే మీ ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. బాదం మిల్క్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బాదం మిల్క్‌లో సోడియం తక్కువగా ఉండటం వలన హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే ఫిష్‌లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో అధికంగా ఉంది. అందువల్ల ఇది గుండె సంబంధిత వ్యాధులను, రక్తపోటును తగ్గిస్తుంది. బాదం పాలు కండరాలు బలోపేతం అవుతాయి. నొప్పులను నివారిస్తాయి. ఎముకలను బలపరుస్తాయి. ఇంకా జ్ఞాపకశక్తిని పెంపొందింపజేసేందుకు చాలా ఉపయోగపడుతుంది.