శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 9 జూన్ 2018 (11:04 IST)

యవ్వనంగా వుండాలా? మెట్లెక్కాల్సిందే..

రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మెట్లెక్కితే చాలు.. ఎముకలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెనోపాజ్‌ వల్ల సహజంగానే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది కనుక, కండరాలను పుష్టిగా మార్చుకోవాలంటే.. రోజుకు ర

రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మెట్లెక్కితే చాలు.. ఎముకలు బలపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెనోపాజ్‌ వల్ల సహజంగానే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది కనుక, కండరాలను పుష్టిగా మార్చుకోవాలంటే.. రోజుకు రెండుసార్లు మెట్లెక్కాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెనోపాజ్ వల్ల కలిగే దుష్పరిణామాల్లో రక్తపోటు సమస్య తలెత్తుతుంది. 
 
కండరాల పనితనం కుంటుపడుతుంది. వీటన్నింటికి విరుగుడుగా మెట్లు ఎక్కే వ్యాయామం పనిచేస్తుంది. ఎందుకంటే దీనిద్వారా ఏరోబిక్‌, రెసిస్టెన్స్‌ వ్యాయామాల ఫలితాలు కూడా కలుగుతాయి. ఇవి గుండెకు ఆక్సిజన్‌ను చేరవేసే జీవక్రియను మెరుగుపరుస్తాయి. వీటికి తోడు మెట్లు ఎక్కడం ద్వారా వార్థక్యం సమస్యలను కూడా చాలా వరకు నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. తృణధాన్యాలు, ముడిబియ్యం, రాగి, బార్లీ, జొన్న, ఓట్స్ వంటి చిరుధాన్యాలు రుచికరంగా ఉండడమే కాకుండా ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చితే బరువు తగ్గడం, మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు.