బాదం పప్పులు తింటే బ్లడ్ షుగర్- కేలరీలపై ప్రభావం ఎంత?
స్నాకింగ్ దగ్గరకు వచ్చేసరికి ఉదయం పూట కష్టాల నుంచి గట్టెక్కించే రీతిలో ఉండాలి. మీరు ఏదైతే తినడానికి ఆసక్తి చూపుతారో అది మీ ఉదయం ఆహ్లాదకరంగా మార్చడం లేదా చికాకుగా మార్చడం జరగడమే కాదు, రోజులో మిగిలిన సమయంలో మీరు తినే విధానంపై కూడా ప్రభావం చూపుతుంది. ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా నేతృత్వంలోని నూతన అధ్యయనం వెల్లడించేదాని ప్రకారం, ఉదయం పూట అల్పాహారంగా బాదములను తీసుకోవడం (సాధారణంగా కార్బోహడ్రేట్స్ అధికంగా కలిగిన ఆహారం తో పోలిస్తే) వల్ల బ్లడ్ షుగర్ స్ధాయి మరింత స్థిరంగా ఉంటుంది. రోజులో మిగిలిన సమయంలో తీసుకునే కేలరీల సంఖ్య పరంగా కూడా నియంత్రణ విధిస్తుంది.
ఈ అధ్యయనంలో 18-65 సంవత్సరాల నడుమ వయసు కలిగిన 100 మంది న్యూజిలాండ్ వ్యక్తులను తీసుకున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు కనీసం 42.5గ్రాముల రోస్ట్ చేయని బాదములు లేదా అంతే కేలరీలు కలిగిన స్వీట్ బిస్కెట్ స్నాక్‌ను తీసుకున్నారు. ఈ రెండు స్నాక్స్ కూడా మొత్తం వీరు తీసుకునే కేలరీలలో 10%కు సమానం కాగా కొన్ని కేసులలో ఇది ఇంకాస్త అధికంగానే ఉంది.
ఈ అధ్యయనాన్ని ర్యాండమైజ్డ్ క్రాస్‌ఓవర్ డిజైన్‌లో చేశారు. అంటే, అధ్యయనంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ముందుగా బాదములతో కూడిన స్నాక్స్‌ను అందించారు. ఆ అధ్యయనం పూర్తయిన తరువాత బిస్కెట్ స్నాక్స్‌ను మరో రోజు అందించారు. ఈ రెండు ప్రయోగాల నడుమ వాషవుట్ కాలం కూడా ఉంది. పరీక్ష రోజు అభ్యర్ధులకు ప్రామాణిక అల్పాహారం అందించారు. రెండు గంటల తరువాత, వారికి నిర్ధేశిత అల్పాహారం అందించారు. బ్లడ్ గ్లూకోజ్ మరియు ఆకలిని వారు తినడం పూర్తయిన 15 లేదా 30 నిమిషాల తరువాత గుణించారు. స్నాక్ తీసుకున్న రెండు గంటల తరువాత, అభ్యర్ధులకు లంచ్ అందించారు. ఆ తరువాత రోజులో వారు తీసుకున్నఆహారమూ నమోదు చేశారు.
అధ్యయన ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం, బ్లడ్ షుగర్ స్పందన అనేది బాదములతో కూడిన స్నాక్ తీసుకున్న వారిలో తక్కువగా ఉంది. ఆకలి పరంగా పెద్దగా తేడా ఏమీ ఈ గ్రూప్‌ల నడుమ లేదు కానీ 90 నిమిషాల తరువాత మాత్రం బాదములతో పోలిస్తే బిస్కెట్లు తిన్నవారిలో ఇది తక్కువగా ఉంది. బాదములు లేదా బిస్కెట్ స్నాక్స్ తరువాత లంచ్ సమయంలో తీసుకునే కేలరీల పరంగా పెద్దగా తేడా ఏమీ లేదు. అయితే, ఆహారపు అలవాట్ల పరంగా ఎవరైత బాదములను స్నాక్‌గా తీసుకుంటారో, అలాంటి వారిలో ఈ కేలరీలు తీసుకోవడం 150 కేలరీలు తక్కువగానే ఉంది. ఒకవేళ దీనిని కొనసాగిస్తే, నెలకు అరకిలో చొప్పున బరువు తగ్గే అవకాశం ఉంది.
సంవత్సర కాలం పాటు జరిగే అధ్యయనంలో భాగంగా నిర్వహించిన ఈ ఒక్కరోజు అధ్యయనం ద్వారా బరువు నియంత్రణలో జరిగే దీర్ఘకాల ప్రభావాలను గురించి పరిశీలించారు. గతంలో యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఫలితాలతో పోల్చినప్పుడు ఈ ఫలితాలు స్ధిరంగా ఉన్నాయి. అసలు అల్పాహారం తీసుకోకుండా ఉండటం కన్నా కాస్త పొద్దెక్కిన తరువాత బాదములను స్నాక్‌గా తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రణలో ఉండటంలో సహాయపడుతుంది మరియు లంచ్, డిన్నర్ సమయాలలో తక్కువ కేలరీలు తీసుకోవడమూ వీలవుతుంది. పూర్తిగా అల్పాహారం తీసుకోకుండా ఉండటం కన్నా కూడా మిడ్ మార్నింగ్ స్నాక్‌గా బాదములు తీసుకోవడం మంచిదని గత అధ్యయనాలు వెల్లడించాయి.
బాదములను అల్పాహారంగా ఉదయం పూట తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలను గురించి మా అధ్యయన ఫలితాలు వెల్లడించాయి అని డాక్టర్ రాచెల్ బ్రౌన్,లీడ్ రీసెర్చ్ మరియు ప్రొఫెసర్- డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్, యూనివర్శిటీ ఆఫ్ ఒటాగో అన్నారు. అంతేకాదు, మా అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం అల్పాహార అనంతర బ్లడ్ షుగర్ స్పందన సైతం నిలకడగా ఉన్నాయి. ఇది అతి ముఖ్యమైన అంశం, ఎందుకంటే, అల్పాహారం తీసుకున్న తరువాత లేదంటే భోజనం తీసుకున్న తరువాత అధికంగా బ్లడ్ షుగర్ ఉండటం వల్ల గుండె వ్యాధుల ప్రమాదం పెరగడంతో పాటుగా మరణాలకూ కారణమవుతుంది అని అన్నారు.
న్యూట్రిషన్ మరియు వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, భారతదేశంలో ఆరోగ్యపరంగా టైప్2 మధుమేహం ఆందోళనకరమైన అంశంగా నిలుస్తుంది. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన, కేలరీలు అధికంగా కలిగిన బిస్కెట్స్‌లాంటి స్నాక్స్ తీసుకోవడం కారణం. ఈ స్నాక్స్‌కు బదులుగా బాదములను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్ధాయి నియంత్రణలో ఉంటుంది. బాదములలో ఫైబర్, ప్రొటీన్, మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్‌వంటివి ఉంటాయి అని అన్నారు.