శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (17:41 IST)

ఒంటిపై బట్టలు లేకుండా నిద్రపోతే బరువు తగ్గుతారా?

కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల పాటు పనిచేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కంప్యూటర్ల పుణ్యమా అంటూ ఆరోగ్య సమస్యలు సైతం అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఆధునికత కారణంగా టెక్నాలజీ పెరగడ

కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల పాటు పనిచేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కంప్యూటర్ల పుణ్యమా అంటూ ఆరోగ్య సమస్యలు సైతం అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఆధునికత కారణంగా టెక్నాలజీ పెరగడంతో శారీరక శ్రమ తక్కువైంది. తద్వారా నిద్రలేమి, ఒబిసిటీ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఒబిసిటీతో పాటు నిద్రలేమికి కూడా చెక్ పెట్టాలంటే.. నగ్నంగా నిద్రపోవాలని పరిశోధకులు అంటున్నారు. 
 
ఒంటిమీద నూలుపోగు లేకుండా నిద్రించడం ద్వారా హాయిగా నిద్రపడుతుందని, నగ్నంగా నిద్రించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రణ ఉంటుందని తద్వారా గాఢనిద్ర పడుతుందని.. దుస్తులతో నిద్రిస్తే.. శరీర వేడిమి కారణంగా సుఖనిద్ర లభించదని నిపుణులు అంటున్నారు. ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా నిద్రించడం ద్వారా అధిక బరువు తగ్గిపోతుంది. గాఢమైన నిద్ర కారణంగా శరీరానికి మేలు చేకూర్చే బ్రౌన్ ఫ్యాట్ పెరిగి, కొవ్వు కరిగిపోతుందని తెలిపారు.
 
అంతేగాకుండా ప్రైవేట్ భాగాల్లో చెమట పట్టదు. తద్వారా ఇన్ఫెక్షన్లు, అలర్జీలు దూరమవుతాయి. వీర్యకణాల వృద్ధి వేగంగా జరుగుతుంది. ఇక జీవిత భాగస్వామి కూడా పక్కనే ఉంటే శరీరానికి ఎంతో ఉపయోగమైన ఆక్సీటోసిన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఆక్సీటోసిన్‌ను 'లవ్ హార్మోన్' అని కూడా అంటారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.