సజ్జ రొట్టెలు, రాగిజావలను కనీసం వారానికి నాలుగు సార్లైనా తీసుకోండి...
సాధారణంగా వయస్సుతో పాటు వాతావరణ మార్పులు ముఖంపై చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 30-35యేళ్లు దాటగానే చర్మం సాగటం, వదులుకావడం, నిగారింపు తగ్గిపోవడం, ముఖ్యంగా ముడతలు పడటం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్
సాధారణంగా వయస్సుతో పాటు వాతావరణ మార్పులు ముఖంపై చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 30-35యేళ్లు దాటగానే చర్మం సాగటం, వదులుకావడం, నిగారింపు తగ్గిపోవడం, ముఖ్యంగా ముడతలు పడటం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్యలు వేసవి కాలంలో ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో ముఖం పొడిబారిపోయినట్టుగా ఉంటుంది.
వీటి నుంచి పరిష్కారం పొందాలంటో... చిన్నపాటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే చాలంటున్నారు బ్యూటీషియన్లు. వాతావరణంతో ఎలాంటి సంబంధం లేకుండా చల్లటి నీటితో స్నానం చేయటం ఉత్తమమని చెపుతున్నారు. అలాకాకుండా వేడినీటితో స్నానం చేస్తే చర్మం త్వరగా సాగిపోయి ముడుతలు పడే అకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నారు.
వీటితో పాటు.. సజ్జ రొట్టెలు, రాగిజావలను వారానికి కనీసం నాలుగు సార్లు, అలాగే సొరకాయ, బీర, పొట్లకాయ, గుమ్మడి, కీరదోస.. లాంటి కూరగాయలను ఎక్కువగా ఆరగించడం వల్ల చర్మానికి ఎంతగానో తోడ్పడుతాయని చెపుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిద్రను నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు.
ఇకపోతే.. ప్రతి రోజూ మజ్జిగలో కాస్తంత జీలకర్ర వేసి రోజుకు రెండుసార్లు తీసుకుంటే చర్మానికి మేలు చేస్తుందని చెపుతున్నారు. మంచినీటిలో వట్టివేర్లను వేసుకుని తాగాలి. ఈ నీరు శరీరానికి చలువ చేయడమే కాకుండా, చర్మానికి కూడా మంచిదేనంటున్నారు. వీటితో పాటు.. బార్లీ, ఓట్స్‌లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందన్నారు.