సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2017 (11:15 IST)

నీళ్ల సీసాను పక్కనే పెట్టుకోండి.. బరువును తగ్గించుకోండి..

నీరు తాగకపోతే.. బరువు పెరిగిపోతారు. ఒబిసిటీ తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీళ్లు తాగనందువల్ల శరీరం తనకున్న ప్రతి నీటి చుక్కనీ దాచుకోవడం మొదలుపెడుతుంది. దాంతో శరీరం బరువు పెరుగుతుంది. వినడానికి కాస్త

నీరు తాగకపోతే.. బరువు పెరిగిపోతారు. ఒబిసిటీ తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీళ్లు తాగనందువల్ల శరీరం తనకున్న ప్రతి నీటి చుక్కనీ దాచుకోవడం మొదలుపెడుతుంది. దాంతో శరీరం బరువు పెరుగుతుంది. వినడానికి కాస్త కొత్తైనప్పటికీ ఇది నిజమేనని వైద్యులు చెప్తున్నారు. అలాగే టీ, కాపీలు తీసుకోవడం మానేసి.. నీటిని తీసుకోవడం ద్వారా శరీరం తేమగా మారుతుంది. ఎందుకంటే? శరీరం డీహైడ్రేషన్‌కి గురయినప్పుడు శక్తి తగ్గిపోతుంది. 
 
శరీరంలో నీరు తక్కువైతే ఏకాగ్రత కుదరదు. మనం తీసుకునే నీళ్లల్లో ఎనభైశాతం వరకూ మెదడు సామర్థ్యం, దాని పనితీరు ఆధారపడి ఉంటాయి. అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు తగినని నీళ్లు తీసుకోగలిగితే మానసిక సామర్థ్యం పెరుగుతుందని అధ్యయనాలు తేల్చాయి. 
 
అలాగే మనసంతా ఏదో ఆందోళన.. విసుగ్గా ఉంటే.. శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోవడం కూడా కారణమని చెప్పవచ్చు. కాబట్టి ఎప్పుడూ నీళ్లసీసాను పక్కన ఉంచుకోవడం వల్ల ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.