మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 27 జూన్ 2017 (06:47 IST)

చేతులు కడుక్కుంటే చాలు ఐడియాలు అమాంతంగా పుట్టుకొస్తాయట.. నిజమేనా?

తినేముందు చేతులు ఎందుకు కడుక్కోవాలి శుభ్రంగా ఉండడానికి.. చేతులపై ఉండే క్రిములు తొలగిపోవడానికి కడుక్కోవాలనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొత్త ఆలోచనలు రావాలంటే చేతులు కడుక్కోవాలనే విషయం మీకు తెలుసా శాస్త్రవేత్తలు మాత్రం ఇదే చెబుతున్నారు. చేతులు కడుక్

తినేముందు చేతులు ఎందుకు కడుక్కోవాలి శుభ్రంగా ఉండడానికి.. చేతులపై ఉండే క్రిములు తొలగి పోవడానికి కడుక్కోవాలనే విషయం అందరికీ తెలిసిందే. కానీ కొత్త ఆలోచనలు రావాలంటే చేతులు కడుక్కోవాలనే విషయం మీకు తెలుసా శాస్త్రవేత్తలు మాత్రం ఇదే చెబుతున్నారు. చేతులు కడుక్కోవడం వల్ల మురికి తొలగిపోవడమే కాకుండా పాత ఆలోచనలు దూరమై, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయంటున్నారు. 
 
కెనడాకు చెందిన యూనివర్సిటి ఆఫ్‌ టొరంటో శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. చేతులు కడుక్కున్న వెంటనే పాత నిర్ణయాలను పక్కకునెట్టి కొత్త లక్ష్యాలకోసం మన మెదడు ఫ్రెష్‌గా ఆలోచిస్తుందంటున్నారు. పరిశోధనలో భాగంగా కొంతమందిని ఎంపికచేసి, వారికి ప్రేరేపణ కలిగించే  నాలుగురకాల పరీక్షలను నిర్వహించారు. 
 
అంతకుముందు ఎంపికచేసిన వారిలో కొందరిని చేతులు కడుక్కోమని చెప్పా రు. అలా చేతులు కడుక్కున్నవారు పరీక్షలను విజయవంతంగా పూర్తిచేశారట. అందుకు కారణం.. వారిలో సానుకూల భావనలు పెరగడమేనని, అంతకు ముందున్న పాత ఆలోచనలు సమసిపోవడమేనని శాస్త్రవేత్తలు తెలిపారు.