మంగళవారం, 14 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శనివారం, 14 జనవరి 2017 (13:37 IST)

రక్తస్రావానికి కరెంటుతో ట్రీట్మెంట్...!

శరీరం మీద గాయమైతే వెంటనే ఏం చేస్తాం. కట్టుకట్టడం ద్వారా రక్తస్రావాన్ని అడ్డుకుంటాం. కానీ భవిష్యత్తులో అలాంటి అవసరం ఉండదు. పైగా కట్టు వల్ల శరీరం మీద గాయం నుంచి మాత్రమే రక్తస్రావాన్ని అరికట్టగలం. కానీ శ

శరీరం మీద గాయమైతే వెంటనే ఏం చేస్తాం. కట్టుకట్టడం ద్వారా రక్తస్రావాన్ని అడ్డుకుంటాం. కానీ భవిష్యత్తులో అలాంటి అవసరం ఉండదు. పైగా కట్టు వల్ల శరీరం మీద గాయం నుంచి మాత్రమే రక్తస్రావాన్ని అరికట్టగలం. కానీ శరీరంలోపల ఏదైనా అవయవం నుంచి రక్తం కారితే అది ప్రాణాంతకమే. అందుకే ఫెయిన్‌ స్టీన్‌ ఇన్సిట్యూట్‌కి చెందిన పరిశోధకులు బయో ఎలక్ట్రిక్ విధానాన్ని రూపొందించారు. ఓ చిన్న పరికరాన్ని శరీరం మీద ఉంచి దాని ద్వారా కరెంటుని శరీరంలోని వేగస్ అనే ప్రధాన నరానికి ప్రవహింపజేస్తారు. 
 
ఈ నాడి మెదడు, గుండె, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలన్నింటికీ అనుసంధానమై ఉంటుంది. దాంతో కరెంటు దీన్ని చేరిన వెంటనే ప్లీహాన్ని ప్రేరేపించి రక్తం గడ్డకట్టే ప్లేట్‌లెట్ కణాలను సంబంధిత భాగానికి పంపించేలా చేస్తుంది. తద్వారా గాయం నుంచి రక్తప్రవాహం ఆగుతుంది. గతంలో దీన్ని పందుల్లో ప్రయోగించి చూడగా అది యాభై శాతం రక్తస్రావాన్ని అడ్డుకోగలిగింది.
 
దాంతో మరింత లోతుగా పరిశోధన చేసి పూర్తిస్థాయిలో రక్తస్రావాన్ని అడ్డుకోగలిగారు. కాబట్టి ఈ పరిశోదన వల్ల భవిష్యత్తులో శస్త్ర చికిత్సలు మరింత సులభతరం కానున్నాయనీ, అలాగే అంతర్గత రక్తస్రావం కారణంగా నమోదయ్యే మరణాల శాతం తగ్గుతుందనీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.