మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 3 మే 2017 (15:39 IST)

ఏటీఎం రసీదుల వల్ల పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గిపోతుందట..

ఏటీఎం రసీదుల వల్ల పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గిపోతుందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే అంటున్నారు పరిశోధకులు. ఏటీఎంల నుంచి వచ్చే రసీదులో ఉపయోగించే కాగితం, ఇంక్ రెండూ పురుషుల్లో సంతాన సాఫల్యతను తగ్గించే

ఏటీఎం రసీదుల వల్ల పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గిపోతుందంటే నమ్ముతారా? నమ్మితీరాల్సిందే అంటున్నారు పరిశోధకులు. ఏటీఎంల నుంచి వచ్చే రసీదులో ఉపయోగించే కాగితం, ఇంక్ రెండూ పురుషుల్లో సంతాన సాఫల్యతను తగ్గించేస్తాయని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ఇదేవిధంగా లాటరీ టిక్కెట్లు, సూపర్ మార్కెట్లో ఇచ్చే రసీదులను ఉపయోగించడం ద్వారా కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
ఇందుకు కారణం ఏమిటంటే? ఏటీఎం రసీదులో బిస్పినాల్-బి అనే రసాయనం అధికంగా వాడటమే. ఇది పురుషుల్లోని శరీరంలో అస్టిరోజన్ అనే హార్మోన్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. దీని ప్రభావంతో సంతాన సాఫల్యత తగ్గిపోతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
అందుచేత ఏటీఎంల రసీదులను చేతిలో తీసుకోవడం కూడదని, వాటిని ఉపయోగించే ముందు గ్లౌజ్‌ను ఉపయోగించవచ్చునని వారు చెప్తున్నారు. వాటిని చేతిలో ఎక్కువ సేపు ఉంచుకోవడం కూడదని, ప్యాకెట్లు, పర్సుల్లో వాటిని ఉంచకూడదు. జేబుల్లో పెట్టడం చేయకూడదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
ఇదే విధంగా మహిళల్లో ఈ రసీదులు బ్రెస్ట్ క్యాన్సర్‌కు.. పురుషుల్లో టెస్టికల్ క్యాన్సర్‌కు దారితీస్తుందని, ఇంకా మెదడు పనితీరును మందగించేలా చేస్తుందని వైద్యులు అంటున్నారు. ఒబిసిటీ, డయాబెటిస్‌కు కూడా దారితీస్తుంది.