గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 2 జనవరి 2024 (23:34 IST)

క్యాప్సికమ్ తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

capsicum
కూరగాయల్లో క్యాప్సికమ్ కూడా ప్రత్యేకమైనది. దీనిని ఏదో వెజిటబుల్ రైస్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరల్లో వాడుతుంటారు. కానీ క్యాప్సికమ్ తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో తెలుసుకుందాము. క్యాప్సికమ్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాప్సికమ్‌లో జియాక్సాంటిన్- లుటిన్ ఉండడమే కారణం.
 
క్యాప్సికమ్‌లో ఐరన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది. క్యాప్సికమ్‌లోని విటమిన్ బి6, మెగ్నీషియం, సోడియం విటమిన్లు నరాల పనితీరుకు మేలు చేస్తాయి. క్యాప్సికమ్‌లో వున్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలు కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తాయి.
 
క్యాప్సికమ్‌లో విటమిన్ సి చాలా ఎక్కువ కనుక రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది. క్యాప్సికమ్‌లో మాంగనీస్ ఉంటుంది కనుక ఇది ఎముక మృదులాస్థి, ఎముక కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన, అందమైన కేశాల కోసం క్యాప్సికమ్ తింటే మంచిదని నిపుణులు చెపుతారు. క్యాప్సికమ్ అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు కనుక మితంగా తీసుకోవాలి.