మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 11 డిశెంబరు 2020 (23:23 IST)

ఇలాంటి ఆహారం తీసుకుంటే నిద్ర ఎలా వస్తుంది?

రాత్రిపూట సరిగా నిద్ర పట్టటం లేదని బాధపడుతున్నారా? అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో కూడా కాస్త చూసుకోండి. ఎందుకంటే మనం తినే తిండి, తాగే పానీయాలూ నిద్రపై చాలా ప్రభావం చూపుతాయి. కొన్ని నిద్ర పట్టనీయకుండా చేస్తే.. మరికొన్ని మగతను కలగజేస్తాయి.
 
నిద్ర పట్టక సతమతమయ్యేవారు సాయంత్రం వేళల్లో, పడుకునే ముందు కెఫీన్‌ గల కాఫీ వంటివి తాగకపోవటమే మంచిది. ఇవి త్వరగా నిద్ర పట్టకుండా చేస్తాయి.
 
క్రీడాకారులు వాడే తక్షణ శక్తినిచ్చే పానీయాల వంటివి తాత్కాలికంగా ప్రభావం చూపొచ్చు గానీ ఇవి తరచుగా శక్తి మొత్తం హఠాత్తుగా పడిపోయేలా చేస్తాయి. ఫలితంగా మగతను కలగజేస్తాయి.
 
మద్యపానం ముందు మత్తును కలిగించినా.. తరచూ నిద్ర నుంచి మేల్కొనేలా చేస్తుంది. గాఢనిద్ర పట్టకుండా అడ్డుకుంటుంది.
 
పిండి పదార్థాలతో కూడిన ఆహారం.. ట్రీప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లాన్ని మెదడుకు చేరుకునేలా చేసి త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. ప్రోటీన్లతో నిండిన పదార్థాల్లోనూ ట్రీప్టోఫాన్‌ ఉంటుంది. అందువల్ల ప్రోటీన్లతో పాటు పిండి పదార్థాలనూ తీసుకోవటం నిద్రకు ఉపకరిస్తుంది.
 
కడుపు నిండా పిండి పదార్థాలు ఎక్కువగా గల ఆహారం తిన్నప్పుడూ నిద్రమత్తుతో జోగేలా చేస్తుంది.