శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జనవరి 2020 (14:11 IST)

నెయ్యిని రోజూ ఒకటిన్నర టీ స్పూన్ వాడితే ఏమౌతుందంటే?

నెయ్యిని వాడటం ద్వారా ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలున్నాయి. రోజుకు ఓ స్పూన్ మోతాదులో నెయ్యిని వాడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ ఏ,డీ, ఈ, కేలను కలిగివున్న నెయ్యిలో గుడ్ కొలెస్ట్రాల్ వుంటుంది. యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వున్నాయి ఇవి జుట్టు. చర్మాన్ని మృదువుగా వుంచుతాయి. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.  
 
రోజూకు మూడు స్పూన్లు లేకపోతే ఒకటిన్నర టీ స్పూన్ నెయ్యిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా తీసుకుంటే హృద్రోగ సమస్యలు, కీళ్ల నొప్పులు, హైబీపీ వుండదు.

ముఖ్యంగా పసుపు రంగులో ఉండే నెయ్యి మాత్రమే ఆహారంలో భాగం చేసుకోవాలని.. తెలుపు రంగులో వుండే నెయ్యిని వాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నెయ్యిని ఎక్కువగా వేడి చేయకుండా వాడటం మంచిది. చర్మానికి, జుట్టుకు కూడా నెయ్యిని పట్టించడం ద్వారా మంచి ఫలితాలుంటాయని న్యూట్రీషియన్లు అంటున్నారు.