శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (18:41 IST)

జామపండు గుజ్జులో తేనెను కలిపి తీసుకుంటే?

జామపండును ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. 
 
ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుందని నిపుణులు చెపుతున్నారు. జామపండును తింటే శరీరంలో రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. జామపండు చెట్టులోని 20 నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులుంటే మటుమాయమై పోతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు.