శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 23 ఫిబ్రవరి 2023 (19:34 IST)

ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగితే?

కొబ్బరి నీరు ప్రయోజనాలు తెలిస్తే వాటిని ప్రతిరోజూ తాగుతారు. కొబ్బరి నీరు సహజసిద్ధంగా లభించే ఖనిజ లవణాలు కలిగిన నీరు. ఇది మందుల యొక్క దుష్ప్రభావలను అరికడుతుంది. ఇంకా కొబ్బరి నీరుతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీరు తాగితే రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పొటాషియం-రిచ్ ఫుడ్స్‌తో కొబ్బరి నీటిని తీసుకోవడం ఆరోగ్యకరమైన హృదయానికి దోహదపడుతుంది.
 
కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం గడ్డలు ఏర్పడకుండా నిరోధిస్తుంది.ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగితే టాక్సిన్స్‌ను శుభ్రపరచడానికి, శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. లేత కొబ్బరి నీరు తాగుతుంటే కాలేయ గాయం నుండి అవి రక్షిస్తాయి.
 
థైరాయిడ్ రోగులకు కొబ్బరికాయ ఉత్తమమైన పానీయం. కొబ్బరి నీరు తాగితే చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొబ్బరి నీరు కిడ్నీలో రాళ్లను కరిగించడంలో కూడా సహాయపడుతుంది. టైఫాయిడ్, మూత్రపిండ సంబంధిత వ్యాధులు, మూత్ర విసర్జనలోని లోపాలు, కిడ్నీలోని రాళ్ళు, టాక్సిమిన్, వంటి వాటిని ఎదుర్కొంటుంది. మలబద్ధకం, అజీర్తిని, అస్తమా, కడుపులో పుండు, నల్లటి మచ్చలు, మొటిమలను తొలగించే శక్తి కొబ్బరి నీరుకి వుంది.